Webdunia - Bharat's app for daily news and videos

Install App

దయచేసి అర్థం చేసుకోండి... ఆంక్షలు కొనసాగుతాయ్ : గౌతం సవాంగ్

Webdunia
బుధవారం, 1 జులై 2020 (09:50 IST)
ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే వారికి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ఓ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి ఎవ్వరూ రావొద్దని, దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఆయన ప్రాధేయపడ్డారు. 
 
హైదరాబాద్ నగరంలో లాక్డౌన్ విధించనున్నారనే వార్తల నేపథ్యంలో అనేక మంది ఏపీ వాసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యూ కట్టారు. దీనిపై ఏపీ డీజీపీ స్పందిస్తూ, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారిని ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకూ మాత్రమే అనుమతిస్తామని, ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని సహకరించాలన్నారు. 
 
ఏపీకి వచ్చే వారిపై ఆంక్షలు కొనసాగుతాయని, సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే రాష్ట్రంలోకి అనుమతిస్తామన్నారు. ఏపీకి వచ్చే వారు స్పందన పోర్టల్ ద్వారా అనుమతి తీసుకుని పాస్ పొందిన తర్వాతనే రావాలని సూచించారు. 
 
ఈ పాస్‌లు ఉన్నప్పటికీ రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకూ అనుమతించబోమని స్పష్టం చేసిన ఆయన, రాత్రి పూట అత్యవసర, నిత్యావసర సేవలకు మాత్రం అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీలోకి రావాలనుకుంటే ఈ పాస్ ద్వారా ఖచ్చితంగా అనుమతి పొందాల్సిందేనని చెప్పారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments