18 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు.. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా...

ఠాగూర్
గురువారం, 14 మార్చి 2024 (09:52 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీ నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షా సమయానికి విద్యార్థులు ఐదు నిమిషాల పాటు ఆలస్యంగా రావొచ్చని, ఆ తర్వాత ఒక ఐదు నిమిషాల కంటే ఒక సెకను ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోని అనుమతించబోమని ఎస్ఎస్సీ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. ఈ పబ్లిక్ పరీక్షల కోసం సంబంధించి బోర్డు అన్ని ఏర్పాట్లుచేస్తోంది. చివరి నిమిషంలో ఇబ్బంది తలెత్తకుండా విద్యార్థులు పరీక్షా సమయానికంటే ముందుగానే ఎగ్జామ్ సెంటర్లకు రావాలని బోర్డు సూచించింది. గతంలోలా ప్రశ్నపత్రాలు తారుమారు కాకుండా చూసేందుకు బోర్డు పలు చర్యలు తీసుకుంది. పేపర్ కోడ్, సబ్జెక్టు, మీడియం వంటివి తప్పుగా వచ్చినట్లైతే వెంటనే చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారులను సంప్రదించాలని సూచించింది.
 
ముఖ్యంగా, తెలుగు పరీక్ష రోజున ప్రశ్నపత్రాలు తారుమారయ్యే అవకాశాలు ఉంటున్నాయి. పదో తరగతి రెగ్యులర్ విద్యార్థులకు 10టీ, 02టీ కోడ్ ఉన్న పేపర్లకు 80 మార్కుల పరీక్ష నిర్వహిస్తున్నారు. అదే రోజు కాంపోజిట్ కోర్సు తెలుగు విద్యార్థులకు 60 మార్కులకు 03టీ కోడ్ పేపర్ పరీక్ష ఉంటోంది. ఈ రెండు పేపర్ల పంపిణీలో ఇన్విజిలేటర్లు గందరగోళానికి లోనవుతున్నారు. ఉర్దూ విషయంలోనూ ఈ సమస్య ఉంది. సమస్యకు పరిష్కారంగా కాంపోజిట్ ప్రశ్న పత్రాలను కలర్ పేపర్‌పై ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments