Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెంబ‌ర్ వ‌న్ ఛాన‌ల్ ఎండీపై వేటు ఖాయం... వ‌ప‌న్ స‌పోర్ట్ ఉందా?

విజ‌య‌వాడ‌: నెంబ‌ర్ వ‌న్ ఛాన‌ల్‌కు జ‌న‌సేన ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌పోర్ట్ ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ, ఇపుడు తుని ఘ‌ట‌న త‌ర్వాత ఆ ఛాన‌ల్ పైన క్రిమిన‌ల్ కేసులు న‌మోద‌య్యాయి. ఛాన‌ల్ ఎండిని సిఐడి ప్ర‌శ్నిస్తోంది. అస‌లింత‌కీ ఈ ఛాన‌ల్ పూర్వ‌ాప‌రాలు ఏంటి?

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2016 (09:38 IST)
విజ‌య‌వాడ‌: నెంబ‌ర్ వ‌న్ ఛాన‌ల్‌కు జ‌న‌సేన ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌పోర్ట్ ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ, ఇపుడు తుని ఘ‌ట‌న త‌ర్వాత ఆ ఛాన‌ల్ పైన క్రిమిన‌ల్ కేసులు న‌మోద‌య్యాయి. ఛాన‌ల్ ఎండిని సిఐడి ప్ర‌శ్నిస్తోంది. అస‌లింత‌కీ ఈ ఛాన‌ల్ పూర్వ‌ాప‌రాలు ఏంటి?
 
నెంబ‌ర్ 1 న్యూస్ ఛానల్ ఎండీ మంచాల సాయి సుధాకర్ నాయుడు లక్ష్యం ఎమ్మెల్యే కావడం.. దీనికోసమే టీవీ ఛానల్ పెట్టారనే వాదనలున్నాయి. గతంలో పోలీస్ శాఖలో మమూలు కానిస్టేబుల్‌గా ఉండి ఆ శాఖలో సస్పెండ్ అయి సామాజికవర్గం రాజకీయల‌ పిచ్చితో ప్రజారాజ్యం పార్టీలో చేరి కొన్ని రోజుల తర్వాత ఆ పార్టీలో నుంచి బ‌యటకి వచ్చాని అంటారు. కొన్నాళ్ళ ఖాళీగా ఉండి విదేశాల నుoచి వ‌చ్చిన భారీ డబ్బుతో ఎంఎస్సార్ న్యూస్ ఛానల్ పెట్టారంటూ ప్రచారం నడుస్తోంది.
 
అయితే ఇక్కడే ఉన్నది అసలు తిరకాసు. నెంబ‌ర్ 1 న్యూస్ ఛానల్ ఎక్విప్మెంట్ మాత్రమే. ఎం.ఎస్.ఆర్. బిల్డింగ్ అద్దెది. నెంబ‌ర్ వ‌న్ న్యూస్ ఛానల్‌కి శాటిలైట్ ఛానల్ అనుమతి లేదు. వార్త సంస్థతో నెలకి 10 లక్షల అద్దె ప్రతిపాదన మీద వార్త శాటిలైట్ ఛానల్ మూడేళ్ళు అద్దెకు తీసుకొన్నారు. ఆ తర్వాత ఛానల్లో తమ సామాజికవర్గానికి చెందిన సిబ్బందిని జాయిన్ చేసుకొని తమ సామాజిక వర్గానికి చెందిన వార్త ప్రసారాలకి ప్రాధాన్యం ఇచ్చేవారని విమర్శలున్నాయి. తమ సిబ్బందికి సరిగా నెల వారి జీతాలు ఇవ్వలేక సంస్థలో సిబ్బందిని చాలా మందిని తీసి వేశారని కూడా చెపుతుంటారు.
 
ఇక ఎంఎస్ఆర్. మంచాల సాయి సుధాకర్‌కి ఎమ్మెల్యే కావాలి అని ఆశ ఉందని ప్రచారం జరుగుతోంది. అందుకే తమ సామాజిక వర్గం కోసమో తన ఛానల్ అని ప్రచారం చేసుకొంటూ, యాత్రలు కొనసాగిస్తుంటారని వాదనలున్నాయి. తుని ఘటనలో తమ సామాజికవర్గం వార్తలు ఎక్కువగా ప్రసారం చేయటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోపం వచ్చి ఎం.ఎస్.వోతో చెప్పి నెంబ‌ర్ వ‌న్ న్యూస్ ఛానల్ ప్రసారాలు నిలిపివేసింది. అప్పటి నుoచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన ఛానల్ ప్రసారాలు రాకపోవడంతో మరింత ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయినట్లు సమాచారం. 
 
పరిస్థితి బాగా లేకపోవడం సిబ్బంది జీతాలు చెల్లిoచడo ఇబ్బందికరంగా మారడంతో విదేశాల‌లో ఉన్న తమ సామాజికవర్గం వారిచే ఛానల్లో  పెట్టుబ‌డుల కోసం ప్రయత్నo చేస్తున్న‌ట్లు తాజా సమాచారం. మ‌రో ప‌క్క తుని విధ్వంస ఘటనలో సిఐడి నోటీసులతో ఎమ్మెస్సార్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న‌ట్లు సమాచారం. సాయి సుధాకర్‌ది గుంటూర్ జిల్లా రేపల్లె కాగా చాలా ఏళ్ళు మంగళగిరి పోలీస్ బెటాలియ‌న్ వద్ద నివాసం ఉండేది. కాగా ఈ ఛానల్ కు పవన్ బ్యాకింగుగా నిలుస్తారేమోనన్న వ్యాఖ్యలు వినబడుతున్నాయి.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments