గుంటూరులో ఘరానా దోపిడీ... నడిరోడ్డుపై లక్షల రూపాయలు చోరీ

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (18:56 IST)
గుంటూరులో ఘరానా దోపిడీ జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై లక్షల రూపాయలు చోరీ అయ్యాయి. కొరిటెపాడుకు చెందిన ఓ వ్యక్తి మిర్చి యార్డులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. వ్యాపార లావాదేవీల నిమిత్తం పట్నం బజారులోని సిటీ యూనియన్‌ బ్యాంకులో రూ.9 లక్షలు డ్రా చేశాడు.
 
డబ్బు సంచిని బైక్ డిక్కీలో ఉంచాడు. ఆ తర్వాత టిఫిన్‌ సెంటర్ కి వెళ్లి టిఫిన్ చేశాడు. అనంతరం తన దుకాణానికి వెళ్లాడు. బైక్‌లో డబ్బు కోసం చూడగా షాక్ కి గురయ్యాడు. డిక్కీలో డబ్బు సంచీ కనిపించలేదు. డబ్బు చోరీకి గురైందని తెలుసుకుని వెంటనే లాలాపేట పోలీసులను ఆశ్రయించాడు.
 
రంగంలోకి దిగిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. ఓ సీసీ కెమెరాలో షాకింగ్ విజువల్స్ బయటపడ్డాయి. డబ్బును ఓ వ్యక్తి దొంగిలించడాన్ని పోలీసులు గుర్తించారు. బైక్‌లో డబ్బుల సంచి పెడుతుండగా సమీపంలోనే ఉండి ఓ దొంగ గమనించాడు. వాహనదారుడు టిఫిన్‌ చేసేందుకు వెళ్లగానే అదను చూసి బైక్ డిక్కీ తెరిచి ఆ మొత్తాన్ని దొంగిలించాడు. సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
 
బ్యాంకుకి వెళ్లిన సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, బ్యాంకు అధికారులు నిత్యం చెబుతూనే ఉంటారు. బ్యాంకుల బయట దొంగలు ఉంటారని, మీకు తెలీకుండా అజ్ఞాత వ్యక్తి మిమ్మల్ని నీడలా వెంటాడుతూ ఉంటాడని, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పదే పదే చెబుతుంటారు. 
 
మీ డబ్బు జాగ్రత్తగా ఉంచుకోవాలని హెచ్చరిస్తూనే ఉంటారు. అయినా, కొందరు వ్యక్తులు నిర్లక్ష్యంగా వ్యవహరించో, ఏమరపాటుగా ఉండో.. అడ్డంగా బుక్కవుతున్నారు. కొద్ది పాటి నిర్లక్ష్యానికి కూడా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments