Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ ఎత్తుకు షాకిచ్చిన ఎన్జీటీ... పోతిరెడ్డిపాడుకు బ్రేక్

Webdunia
బుధవారం, 20 మే 2020 (13:05 IST)
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి‌ వ్యూహానికి జాతీయ హరిత ట్రిబ్యునర్ తేరుకోలేని షాకిచ్చింది. సంగమేశ్వరం వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ కెపాసిటీ పెంపునకు సంబంధించి ఏపీ సర్కారు జారీచేసిన జీవో 203కి స్టే విధించింది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి పనులు చేపట్టొద్దంటూ ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. 
 
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై నిపుణుల కమిటీ వేయాలని ఆదేశించింది. కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో కాలుష్య నివారణ బోర్డు సభ్యుడు, కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డు సీనియర్‌ సభ్యుడు, హైదరాబాద్‌ ఐఐటీ నుంచి ఒకరు సభ్యులుగా ఉన్నారు. రెండు నెలల్లో నివేదిక అందజేయాలని కమిటీని ట్రిబ్యునల్‌ ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ప్రాజెక్టు పనులు ప్రారంభించొద్దని ఏపీకి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. 
 
కాగా, ఇప్పటికే ఏపీ జలవనరుల శాఖ ఈఎస్‌సీకి కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి లేఖ రాసిన విషయం తెల్సిందే. సాగర్ కుడికాల్వ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి నీటి విడుదల ఆపాలంటూ ఆ లేఖలో కోరారు. 
 
మే నెల వరకు ఇచ్చిన కేటాయింపుల కంటే అధికంగా నీటిని వాడుకున్నారంటూ లేఖలో ఆరోపించారు. నీటి విడుదలకు సంబంధించిన ఉత్తర్వులను విధిగా పాటించాలని కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం ఇవ్వని విధంగా వ్యవహరించాలని హితవు పలికింది. ఇపుడు ఎన్జీటీ కూడా స్టే విధించడంతో జగన్ చర్యలకు బ్రేక్ పడినట్టయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments