Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి రోజున జరిగిన గొడవ.. నవదంపతులు మృతి.. పెళ్లికూతురైతే?

సెల్వి
శుక్రవారం, 9 ఆగస్టు 2024 (10:56 IST)
పెళ్లి రోజున జరిగిన గొడవలో ఓ నవ దంపతులు తీవ్ర గాయాలపాలై మరణించిన విషాద సంఘటన కర్నూలులో చోటుచేసుకుంది. కోలార్ జిల్లా, కేజీఎఫ్ తాలూకాలోని చంబరసనహళ్లి గ్రామంలో జరిగిన వివాహంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ ఘటనలో కర్నూలు జిల్లాకు చెందిన వధువు లిఖితశ్రీ అక్కడికక్కడే మృతి చెందగా, వరుడు నవీన్ చికిత్స విఫలమై గురువారం మృతి చెందాడు. చంబరసనహళ్లిలో నివాసముంటున్న నవీన్‌, ఆంధ్రప్రదేశ్‌లోని బైనపల్లి గ్రామానికి చెందిన లిఖితశ్రీలు కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. 
 
తల్లిదండ్రుల నుంచి మొదట్లో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ బుధవారం ఉదయం కుటుంబీకుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనంతరం నవ వధువు వెళ్లిన బంధువుల ఇంట్లో అదేరోజు సాయంత్రం గొడవ జరిగింది. 
 
చిన్నపాటి అభిప్రాయభేదాలతో మొదలైన ఈ వివాదం ఘర్షణగా మారింది. ఈ ఘర్షణలో తీవ్ర గాయాలపాలైన లిఖితశ్రీ అక్కడికక్కడే మృతి చెందింది. నవీన్‌కు కూడా తీవ్రగాయాలు కావడంతో వెంటనే కోలారు జిల్లా ఆసుపత్రికి తరలించారు.
 
అనంతరం బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఎంత ప్రయత్నించినా నవీన్‌ను కాపాడలేకపోయామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అండర్సన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments