Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్త టెక్స్‌టైల్ పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

ఠాగూర్
బుధవారం, 27 నవంబరు 2024 (11:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్త టెక్స్‌టైల్ పాలసీని ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలో సమృద్ధిగా పెట్టుబడులు సాధించడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధిని సాధించేందుకు వీలుగా కొత్త కొత్త పాలసీలను తీసుకొస్తుంది. ఇందులోభాగంగా, పదికిపైగా పాలసీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా టెక్స్ టైల్ పాలసీని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నూతన టెక్స్ టైల్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు.
 
ఈ కొత్త విధానం ద్వారా రూ.10 వేల కోట్ల పెట్టుబడులను రాబట్టేలా విధి విధానాలను ఖరారు చేయనున్నారు. తద్వారా 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. కొత్త పాలసీలో ప్రోత్సాహకాలు ఇచ్చి వీవింగ్, ప్రాసెసింగ్, గార్మెంట్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ యూనిట్స్‌కు ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త పాలసీలో భాగంగా కేపిటల్ సబ్సిడీ పెంచనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు మహిళలకు అదనంగా ప్రోత్సాహకాలు ఇచ్చే అంశంపై ప్రతిపాదించారు.
 
2018-23 పాలసీ కంటే మరింత మెరుగ్గా ఈ పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ రంగంలో వచ్చే పెట్టుబడుల ద్వారా గ్రామ స్థాయిలో పెద్ద ఎత్తున మహిళలకు ఉపాధి కల్పించవచ్చని సీఎం అన్నారు. కొత్త పాలసీ ద్వారా వస్త్ర తయారీలో పెట్టుబడులకు రాష్ట్రం ఉత్తమమైన వేదిక అవుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
 
పాలసీ డ్రాఫ్ట్‌పై సంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి బాబు ఆ తర్వాత అధికారులతో చర్చించి కొత్త టెక్స్ టైల్ పాలసీకి ఆమోదం తెలిపారు. రానున్న రోజుల్లో దీన్ని క్యాబినెట్ ముందుకు తీసుకురానున్నారు. టెక్స్ టైల్ పాలసీతో పాటు లెదర్ పాలసీపై కూడా సీఎం సమీక్ష జరిపారు. మరింత కసరత్తు తర్వాత లెదర్ పాలసీపై ముందుకు వెళ్లాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి కె.సవిత, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

కన్నప్ప తరువాత వంద కోట్లతో మైక్రో డ్రామాల్ని సృష్టించనున్న విష్ణు మంచు

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో ప్రయోగాలు చేస్తున్న అభిమాన దర్శకులు

రియల్ లవ్ కోరుకునే మిస్టర్ రోమియో టీజర్ లాంచ్ చేసిన శ్రియా శరణ్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments