Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పెన్షన్ కోసం కొత్త రూల్స్

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (22:09 IST)
ఏపీలో పెన్షన్ లబ్ధిదారుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసలైన లబ్దిదారులను గుర్తించే పనిలో భాగంగా కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. బోగస్ లబ్దిదారులు ఎక్కువ ఉన్నారన్న ఆరోపణలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

వైఎస్‌ఆర్‌ పింఛను కానుకలో భాగంగా కులవృత్తులు, మెడికల్‌ విభాగాల అర్హుల్ని గుర్తించేందుకు కొత్త నిబంధనలు పొందుపర్చింది. పెన్షన్ పొందాలి అంటే తప్పనిసరి దరఖాస్తుదారులు వారి కులవృత్తినే జీవనాధారం అయి ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మెడికల్‌, ఒంటరి పెన్షన్ల విషయంలోనూ కఠినమైన రూల్స్ పాటించబోతోంది. అవసరమైన పత్రాలను ఎక్సైజ్‌, సాంఘిక సంక్షేమ శాఖ, చేనేత, జౌళిశాఖ, మత్స్యశాఖ, వైద్యశాఖలు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
 
దరఖాస్తు ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో వాలంటీర్లు, సచివాలయ సంక్షేమ కార్యదర్శులు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఉన్నతాధికారులకు అందజేస్తారు. లబ్ధిదారుల వృత్తికి జియోట్యాగింగ్‌ చేసి వారి లాగిన్లు ద్వారా తిరిగి శాఖాధికారుల పరిశీలనకు పంపించాలి. అక్కడ అనుమతి లభించిన దరఖాస్తులకే ఎంపీడీవో, పురపాలిక అధికారులు మంజూరుకు సిఫార్సు చేస్తారు. దీన్ని 21 రోజుల్లో పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీలో 61.28 లక్షల మంది లబ్ధిదారుల ఉన్నారు.

సంబంధిత వార్తలు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments