బెజవాడలో కొత్త సైకో, శరీరానికి ఆయిల్ రాసుకుని మహిళలను బాత్రూంలో చూస్తున్నాడు

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (10:09 IST)
సంవత్సరన్నర నుంచి బెజవాడ పోలీసులకు చిక్కకుండా సైకో తప్పించుకు తిరుగుతున్నాడు. నల్ల ప్యాంట్, నల్ల షర్ట్ ధరించి ముఖం కనిపించకుండా మంకీ క్యాప్ పెట్టుకుంటున్నాడు. మహిళలే టార్గెట్‌గా అర్ధరాత్రి ఇళ్ళలోకి చొరబడుతున్న ఆ సైకో వ్యక్తి ఎవరనేది అంతుబట్టని అంశంగా మారింది.
 
విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో చీకటి పడిందంటే ఓ వ్యక్తి ఇళ్ళలోకి దూరి, కిటికీ చాటున, బాత్‌రూంల మాటున నక్కి మహిళలను చూస్తుంటాడు. అతడు ఎక్కువగా ఒంటరి మహిళలనే టార్గెట్ చేస్తుంటాడు.

మధ్య వయస్కులు, యువతులు బాత్రూమ్‌లో స్నానం చేస్తునప్పుడు, దుస్తులు మార్చుకుంటున్నప్పుడు దొంగచాటుగా చూస్తు పైశాచికానందం పొందుతున్నాడు. 
 
ఈ సైకో ఎక్కువగా విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప నగర్, అశోక్‌నగర్‌లో అతడి ఆగడాలు మితిమీరుతున్నాయి. దీనిపై బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు అతడిని ఆచూకీ కనిపెట్టలేకపోతున్నారు.
 
అతడు ఆగడాలకు పాల్పడిన సమయంలో గుర్తించిన మహిళలు కేకలు వేస్తుండగా సైకో తప్పించుకుని పారిపోతున్నాడు. స్థానికులు పట్టుకోవాలని చూసినా అతడు చిక్కడం లేదు. 
 
ఎవరు పట్టుకున్నా తప్పించుకునేందుకు ముందస్తు జాగ్రత్తగా ఒంటికి ఆయిల్ రాసుకుంటున్నాడు. అతడి ఆగడాలతో విసిగిపోయిన విజయవాడ ప్రజలు తమకు రక్షణ కల్పించాలంటూ ఇటీవల స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను కలిసి మొరపెట్టుకున్నాడు.
 
అయితే పోలీసులు ఎంత నిఘా పెట్టినా ఆ సైకో చిక్కకపోవడం విజయవాడ పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇదంతా చేస్తోంది ఆకతాయిలా.. దొంగలా.. ఇంకెవరైనానా? అన్నది సస్పెన్స్‌గా మారింది.
 
‘మంకీ మ్యాన్‌‌‌‌‌’గా వ్యవహరిస్తున్న అతడిని త్వరలోనే పట్టుకుంటామని విజయవాడ పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments