Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నెల్లూరులో దారుణం.. ప్రేమోన్మాది ఎంత పని చేశాడంటే?

నెల్లూరులో దారుణం.. ప్రేమోన్మాది ఎంత పని చేశాడంటే?
, శుక్రవారం, 2 జులై 2021 (10:05 IST)
నెల్లూరులో ప్రేమోన్మాది విరుచుకుపడ్డాడు. ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. తన ప్రేమను నిరాకరించిందన్న కారణంతో ఆమెపై కక్ష పెంచుకున్న అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతను లోపలికి చొరబడ్డాడు. ఆపై యువతి గదిలోకి వెళ్లి తలుపులు మూసి హత్య చేశాడు. ఆపై అతను ఆత్మహత్యకు యత్నించాడు. యువతిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు.
 
వివరాల్లోకి వెళితే..  నెల్లూరు జిల్లా గూడూరులో సుధాకర్-సరిత దంపతులు నివసిస్తున్నారు. దంపతులిద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమార్తె,కుమారుడు ఉన్నారు. కుమార్తె తేజస్విని ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతోంది. ఇదే క్రమంలో సుధాకర్ సహచర ఉద్యోగి చెంచు కృష్ణయ్య కుమారుడు వెంకటేశ్‌... తేజస్వినితో పరిచయం పెంచుకున్నాడు. కొద్దిరోజులకు అది కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. అయితే ఏడాది కాలంగా వెంకటేశ్ తన ప్రవర్తనతో విసిగిస్తుండటంతో తేజస్విని అతన్ని దూరం పెట్టింది. ఫోన్ నెంబర్ మార్చేసింది. కానీ అతని వేధింపులు ఆగలేదు. 
 
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో అతను తిరిగి గూడూరు వచ్చాడు. అప్పటినుంచి మళ్లీ తేజస్విని వెంటపడటం మొదలుపెట్టాడు. ఓసారి ఇంట్ో తరచూ ఫోన్లు చేసి ప్రేమ పేరుతో ఆమెను వేధించేవాడు. అతని వేధింపులు భరించలేక తేజస్విని తన ఫోన్ నంబర్ కూడా మార్చేసింది. దీంతో వెంకటేశ్ ఆమెపై మరింత కక్ష పెంచుకుని రగిలిపోయాడు. ఆమెపై దాడి చేసేందుకు అదను కోసం ఎదురుచూడసాగాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని ఆమెపై దాడి చేశాడు. 
 
తేజస్విని ఫ్లాట్‌లోకి చొరబడి ఆమె ఉన్న గదిలోకి వెళ్లి తలుపులు మూశాడు. ఆపై కత్తితో ఆమె గొంతులో పొడిచాడు. ఆ తర్వాత చున్నీని మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపాడు. ఆపై అదే గదిలో చున్నీతో కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. 
 
సుధాకర్ పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన వారు అక్కడికి చేరుకున్నారు. తేజస్విని, వెంకటేశ్ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే తేజస్విని మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో సాధారణ వైద్య సేవలు... ఖాళీ అవుతున్న కోవిడ్ పడకలు