Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఉగాది నుంచి కొత్త జిల్లాలు.. పాత కలెక్టర్లు నియామకం..

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (08:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. తెలుగు ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలనను కొనసాగించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. 
 
ఉగాది నుంచే కొత్త జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు కార్యకలాపాలు ప్రారంభించాలని ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన సన్నహాకాలను వేగవంతం చేయాలని అధికారులను సూచించారు. 
 
ఓఎస్డీ హోదాలో కొత్త జిల్లాల్లో కూడా ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలే ఉంటారని చెప్పారు. అంటే కొత్త జిల్లాలకు కూడా పాత కలెక్టర్లే విధులు నిర్వహిస్తారు. కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమైన తర్వాత ఎలాంటి అయోమయం ఉండకూదని ఆయన చెప్పారు. 
 
ఉగాది నాటికల్లా ఉద్యోగుల విభజన, అవసరమైన భవనాలు, మౌలిక సదుపాయాల ఏర్పాట్లు పూర్తి కావాలని ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అంతేకాకుండా, కొత్త జిల్లాల ఏర్పాటులో అభ్యంతరాల విషయంలో హేతుబద్ధత ఉన్నపుడు వాటిని నిశితంగా పరిశీలన చేయాలని ఆయన కోరారు. జిల్లా పరిషత్‌ల విషయంలో కూడా అనుసరించాల్సిన విధానాన్ని న్యాయపరంగా, చట్టపరంగా పరిశీలించి తగిన ప్రతిపాదనలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments