Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాటేసిన మేనమామ.. గర్భందాల్చిన 16ఏళ్ల బాలిక

విశాఖపట్టణం జిల్లాలో ఓ బాలికను మేనమామ లైంగికంగా వాడుకుంటూ వచ్చాడు. ఈ విషయం తెలిసిన ఆ బాలిక తల్లి.. తప్పురా అని చెప్పాల్సింది పోయి... తమ్ముడికే వత్తాసు పలికింది. ఫలితంగా ఆ బాలిక 16 యేళ్లకే గర్భందాల్చిం

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (10:26 IST)
విశాఖపట్టణం జిల్లాలో ఓ బాలికను మేనమామ లైంగికంగా వాడుకుంటూ వచ్చాడు. ఈ విషయం తెలిసిన ఆ బాలిక తల్లి.. తప్పురా అని చెప్పాల్సింది పోయి... తమ్ముడికే వత్తాసు పలికింది. ఫలితంగా ఆ బాలిక 16 యేళ్లకే గర్భందాల్చింది. ఈ విషయం ఇరుగుపొరుగువారి కారణంగా పోలీసులకు తెలిసింది. దీనిపై ఐసీడీఎస్ అధికారులు ఆరా తీస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
విశాఖ జిల్లా బుచ్చెయ్యపేట మండలం పొట్టిదొరపాలెం గ్రామానికి చెందిన గిడుతూరి చినబాబు, మాణిక్యం దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. మాణిక్యంకు సోమరాజు అనే తమ్ముడు ఉన్నాడు. ఇతనికి ఏడేళ్ల క్రితం యువతితో వివాహం జరుగింది. అయితే, కుటుంబ కారణాల రీత్యా భార్య పుట్టింట్టికి వెళ్లిపోయింది. అప్పటినుంచి అక్క ఇంటే సోమరాజు ఉంటూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో ఎనిమిదో తరగతి చదువుతున్న 16 యేళ్ళ అక్క కుమార్తెపై ఆ కామాంధుడు కన్నేశాడు. అక్క, బావ పనులకు వెళ్లిన సమయంలో ఆ బాలికకు మాయమాటులు చెప్పి లైంగికంగా లోబరుచుకున్నాడు. మేనమామ తనను వేధిస్తున్నాడని తల్లికి చెప్పగా, ఆమె కూడా తమ్ముడినే వెనుకేసుకొచ్చింది. పైగా, కుమార్తె గర్భందాల్చిన విషయం గ్రహించి గుట్టుచప్పుడు కాకుండా ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్‌ కూడా చేయించింది. 
 
ఈనేపథ్యంలో ఆ బాలిక మళ్లీ గర్భందాల్చింది. ప్రస్తుతం ఐదు నెలల గర్భంతో తిరుగుతున్న బాలికను చూసి, స్థానికులు ఐసీడీఎస్‌ అధికారులకు సమచారం చేరవేశారు. దీంతో బాలిక తల్లి, మేనమామను ప్రశ్నించగా, వారు జరిగిన విషయం వెల్లడించారు. ఆ తర్వాత బాలికతో పాటు ఐసీడీఎస్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సోమరాజును అరెస్టు చేశారు. బాలికను భీమునిపట్నంలోని బాలసదన్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం