Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవడ్రా... నా కొడుకుని కొట్టింది... కానిస్టేబుల్‌ చొక్కా పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్

Webdunia
ఆదివారం, 29 మార్చి 2020 (14:31 IST)
జిల్లా కేంద్రమైన నెల్లూరులో విధుల్లో ఉన్న ఓ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్‌హై హెడ్ కానిస్టేబుల్ చేయిచేసుకున్నాడు. నా కొడుకునే కొడతావా నా కొడకా అంటూ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ చొక్కాపట్టుకుని దాడికి యత్నించాడు. ఈ ఘర్షణను స్థానికులు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ విషయం చిన్నగా జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లింది. అంతే.. విధుల్లో కానిస్టేబుల్ చొక్క పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులా జారీ చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కరోనా వైరస్ దెబ్బకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. దీంతో నెల్లూరు పట్టణంలో కూడా లాక్‌డౌన్‌ను పోలీసులు సంపూర్ణంగా అమలు చేస్తున్నారు. అయితే, నెల్లూరు పట్టణఁలోని ఎరుకాళమ్మ గుడి వద్ద ఓ విచిత్రమైన ఘటన జరిగింది. ఓ యువకుడు టూ వీలర్‌పై వస్తుండగా, అతన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగి దుర్భాషలాడినట్టు సమాచారం. దీంతో విధుల్లో ఉన్న పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. ఆ తర్వాత ఆ యువకుడి బండి తాళాలు తీసుకున్నారు. 
 
దీంతో సదరు యువకుడు తన తండ్రికి ఫోన్ చేసి జరిగన విషయం చెప్పడంతో ఆయన ఆగ్రహోద్రుక్తుడై హుటాహుటిన ద్విచక్రవాహనంపై అక్కడకు చేరుకున్నాడు. వస్తూనే ఎవడ్రా నిన్ను కొట్టిందంటూ.. దుర్భాషలాడుతూ.. బండి దిగి.. నేరుగా విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని దాడికి దిగాడు. 144 సెక్షన్ అమల్లో వుంటే కొడతావా అంటూ ప్రశ్నించాడు. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా అతని చొక్కా పట్టుకున్నాడు. ఇంతలో స్థానికులు అక్కడకు చేరుకుని వారిద్దరిని వేరుచేశారు. ఆపై తన బిడ్డకు ఆపరేషన్ జరిగిందని, కాళ్లలో రాడ్ వేశారని, పెట్రోల్ కోసం వస్తే కొట్టారని ఆరోపిస్తూ, ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు తన కుమారుడిని తీసుకెళ్లాడు. 
 
ఈ తతంగాన్నంతా వీడియో తీసిన స్థానికులు సోషల్ మీడియాతో పాటు.. లోకల్ కేబుల్ టీవీలకు క్లిప్లింగ్స్ ఇచ్చారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నపుడు పోలీసు పిల్లలపై దాడి చేస్తే పరిస్థితి ఇలా ఉంటుందంటూ లోకల్ కేబుల్స్ ప్రత్యేకంగా ఘర్షణ వీడియో క్లిప్పింగ్స్‌ను పదేపదే ప్రసారం చేశాయి. దీంతో విషయం కాస్త జిల్లా ఎస్పీ దృష్టికెళ్లడంతో విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేసిన హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అయితే, లాక్‌డౌన్ అమల్లో ఉన్న సమయంలో హెడ్ కానిస్టేబుల్ ఇలా ప్రవర్తించడం స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

తర్వాతి కథనం
Show comments