Webdunia - Bharat's app for daily news and videos

Install App

టూరిజం మేనేజర్ ఊచలు లెక్కిస్తున్నాడు

Webdunia
బుధవారం, 1 జులై 2020 (16:46 IST)
మాస్క్ పెట్టుకో అన్నందుకు వికలాంగురాలని కూడా చూడకుండా గొడ్డును బాదినట్లు బాదిన నెల్లూరు పర్యాటక శాఖ డిప్యూటీ మేనేజర్ భాస్కర్ పాపం పండింది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవహారం పెద్ద చర్చకు దారితీసింది. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు.
 
వికలాంగురాలిని అతి దారుణంగా కొడుతున్న విజువల్స్ సి.సి.ఫుటేజ్ ద్వారా మీడియాకు బయటకు రావడంతో అసలు విషయం బయటపడింది. దీంతో అప్పటి వరకు స్పందించని పోలీసులు కేసు నమోదు చేశారు. ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా ఈ వ్యవహారం వెళ్ళడంతో విషయం కాస్త మరింత సీరియస్ అయ్యింది.
 
అలాగే టిడిపి నేతలు ఈ వ్యవహారంపై తీవ్రంగానే స్పందించారు. దీంతో పోలీసులు ఆగమేఘాల మీద భాస్కర్‌ను అరెస్టు చేశారు. అతనికి కోవిడ్-19 పరీక్షలు  చేయించారు. రిపోర్ట్ వచ్చిన వెంటనే సబ్ జైలుకు తరలించేందుకు సిద్ధమయ్యారు.
 
వికలాంగురాలిపై దాడి ఘటనను వికలాంగుల సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. దివ్యాంగులపై ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆ సంఘం నేతలు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments