నెల్లూరు నీట మునక : ప్రమాదకరంగా జలాశయాలు - ఉధృతంగా పెన్నానది

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (13:30 IST)
నెల్లూరు జిల్లా నీట మునిగింది. గత కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న కుండపోత వర్షాలలతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకునివున్నాయి. ఈ జిల్లాలోని అన్ని జలాశయాలు నిండుకుండల్లా ఉన్నాయి. వీటిలో అనేకం ప్రమాదకరంగా ఉన్నాయి. కట్టలు తెగి ఎపుడు ఊర్లపై పడుతాయోనన్న ఆందోళనలో స్థానిక ప్రజలతో పాటు అధికారులు ఆందోళన చెందుతున్నారు. 
 
ముఖ్యంగా, జిల్లాలోని కండలేరు, సోమశిల డ్యామ్‌ల నుంచి భారీ మొత్తంలో నీటిని కిందికి విడుదల చేశారు. దీనికితోడు వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో చెరువులు పూర్తిగా నిండిపోయాయి. పొలాలన్నీ నీట మునిగివున్నాయి. 
 
అలాగే, ఇళ్లచుట్టూత నీళ్లు వచ్చిచేరాయి. ఎటు చూసినా నీళ్లు కంటికి కనుచూపు మేరలో కనిపిస్తున్నాయి. దీంతో మూగ జీవాలు మేత లేక అల్లాడుతున్నాయి. ఈ జిల్లాలోని జాతీయ రహదారి 16పై కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. 
 
ప్రస్తుతం సోమశిల జలాశయానికి వరద నీరు పోటెత్తుతుంది. జలాశయానికి 96569 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, 115396 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలివేశారు. దీంతో పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

Anasuya Bharadwaj: నాగబంధం నుంచి లీలావతిగా అనసూయ భరద్వాజ్ లుక్

Ram Pothineni: 38వ పుట్టినరోజున దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న రామ్ పోతినేని

తర్వాతి కథనం
Show comments