Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తతో కలిసి జీవించలేను.. కాపురానికి రమ్మంటూ వేధిస్తున్నాడు.. కాపాడండి

భర్తతో కలిసి జీవించలేను. తనకు న్యాయం చేయండి అంటూ ఓ వివాహిత ప్రభుత్వాన్ని కోరింది. తనకు ఇష్టం లేకపోయినా 15 ఏళ్ల వయసులో మేనమామతో బలవంతంగా పెళ్లిచేశారని.. ఆ పెళ్లి సందర్భంగా ఎవర్నీ ఎదిరించలేకపోయానన్నారు.

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (07:41 IST)
భర్తతో కలిసి జీవించలేను. తనకు న్యాయం చేయండి అంటూ ఓ వివాహిత ప్రభుత్వాన్ని కోరింది. తనకు ఇష్టం లేకపోయినా 15 ఏళ్ల వయసులో మేనమామతో బలవంతంగా పెళ్లిచేశారని.. ఆ పెళ్లి సందర్భంగా ఎవర్నీ ఎదిరించలేకపోయానన్నారు. అయితే ప్రస్తుతం ఆతడి ప్రవర్తన సక్రమంగా లేకపోవడంతో తల్లిదండ్రుల వద్దకు వచ్చేశానని.. కొద్దికాలంగా మేనమామ కాపురానికి రమ్మంటూ వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించింది. ఈ ఘటన నారాయణగూడలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే..  శ్రీకాంత్‌గౌడ్‌ (35)తో బలవంతంగా తన పెళ్లి జరిగిందని..అతనితో రెండు నెలలు మాత్రమే ఉన్నానని.. అతని నుంచి తనకు విడాకులు కావాలని బాధిత బాలిక స్థానికంగా ఉన్న మహిళా నాయకురాలు అనురాధరావు సహకారంతో బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. 
 
శ్రీకాంత్‌గౌడ్‌తో కలిసి ఉండలేనని, పెళ్లి సమయంలో తల్లిదండ్రులు ఇచ్చిన 15 తులాల బంగారు నగలు, రూ.10 లక్షలు తిరిగి ఇవ్వాలని, తాను మైనర్‌నని తెలిసి వివాహం చేసుకున్న శ్రీకాంత్‌గౌడ్‌పై చర్య తీసుకోవాలని కోరింది. భర్త నుంచి తనకు న్యాయం జరిగేలా చూడాలని బాధిత బాలిక కోరింది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments