Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటుడు నారా రోహిత్ ట్వీట్‌తో విశాఖ ఉక్కు పరిరక్షణ సభ్యుల్లో సంతోషం, ఏముందంటే?

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (15:55 IST)
విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఎత్తున నినదిస్తూ విశాఖ కేంద్రంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఇలాంటి నేపథ్యంలో కొంతమంది ప్రముఖులు ఆ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. అయితే సినీప్రముఖుల్లో ఇప్పటివరకు చిరంజీవి మాత్రమే ట్వీట్ చేసి అండగా ఉంటానన్నారు.
 
మిగిలిన సినీప్రముఖులు ఎవరూ స్పందించలేదు. కానీ తాజాగా యువ హీరో నారా రోహిత్ స్పందించారు. విశాఖ ఉక్కు పోరాటం రేపటి వెలుగుకు నాంది కావాలి. నేటి ఉద్యమస్ఫూర్తి రేపటి ప్రగతికి బాటలు వేయాలి. విశాఖ ఉక్కు రెండు తరాల రాష్ట్ర ప్రజానీకానికి కన్నబిడ్డ.. ప్రస్తుత తరానికి రాబోయే తరాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపి ఆకలి తీర్చే తల్లి.
 
ఉక్కు పోరాటంలో నన్నూ భాగస్వామిగా చేసిన కార్మిక లోకానికి వందనం. తెలుగోడి అస్థిత్వానినికి ప్రతీకగా నిలిచిన ఉక్కు ఉద్యమానికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు వెన్ను చూపడం నా నైజం కాదు. సాటి ఆంధ్రుడికి కష్టమొచ్చినప్పుడు అండగా నిలబడతా.
 
తెలుగు జాతి ఆత్మగౌరవంపై దాడి జరుగుతోంది. యువతా మేలుకో నీ పోరాట పటిమతో నవయుగ చైతనన్యానికి నాంది పలుకు. త్యాగధనుల పోరాట ఫలం పరాధీనమవ్వకుండా పిడికిలి బిగించు. తెలుగువారి స్వాభిమానం అపహాస్యమవ్వకుండా ఐక్యపోరాటానికి కదలిరా.. త్వరలో విశాఖ వచ్చి ఉక్కు ఉద్యమానికి మద్థతు తెలుపుతానంటూ ట్వీట్ చేశాడు నారా రోహిత్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments