Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్‌కు నారా లోకేష్ లేఖ.. ఆక్వారంగంపై కన్నేయండి..

Webdunia
గురువారం, 16 జూన్ 2022 (15:35 IST)
ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ నేత‌ నారా లోకేశ్ లేఖ రాశారు. ఆక్వా రంగం ఎదుర్కొంటోన్న స‌మ‌స్య‌లను ఆ లేఖలో ప్రస్తావించారు. సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని గట్టెక్కించాలని నారా లోకేష్ సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. 
 
ఆక్వా రంగం కూడా సంక్షోభంలో ప‌డిందని, విద్యుత్ చార్జీల పెంపు, ఫీడ్ ధ‌ర అధికం కావ‌డం, రొయ్య‌ల ధ‌ర త‌గ్గిపోవ‌డంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఆక్వా హాలీడే ప్ర‌క‌టించాల‌ని రైతులు తీసుకున్నార‌ని నారా లోకేష్ తెలిపారు. 
 
ఈ నిర్ణ‌యంపై ప్ర‌భుత్వం ఇప్ప‌టివ‌ర‌కూ స్పందించ‌క‌పోవ‌డం విచార‌క‌రమ‌ని విమ‌ర్శించారు. ఫీడ్ కేజీకి రూ.20, మిన‌ర‌ల్స్‌, ఇత‌ర మందుల ధ‌ర‌లు 30 శాతం పెరిగినా సీఎం దృష్టికి ఈ స‌మ‌స్య రాక‌పోవ‌డం విచిత్ర‌మేన‌ని ఎద్దేవా చేశారు. 
 
రొయ్య‌ల రేటు ఏ కౌంటు అయినా కేజీ సుమారు రూ.70 నుంచి రూ.150 వ‌ర‌కూ త‌గ్గినా సీఎం నుంచి స్పంద‌న శూన్యమ‌ని విమ‌ర్శించారు. ఆక్వా రంగానికి మేలు చేస్తాన‌ని హామీలు ఇచ్చిన మీరు జ‌గ‌న్.. అధికారంలోకి వ‌చ్చాక ఫీడ్-సీడ్ యాక్ట్ తేవ‌డంతో రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారని నారా లోకేశ్ చెప్పారు. ఆక్వా జోన్ పరిధిలోని రైతులకు మాత్రమే సబ్సిడీ పేరుతో 80 శాతం మందికి స‌బ్సిడీలు ఎత్తివేయ‌డం ముమ్మాటికీ ఆక్వా రైతుల‌ను ద్రోహం చేయ‌డ‌మేన‌ని అన్నారు. 
 
టీడీపీ గతంలో అన్నిర‌కాలుగా ఆక్వారంగానికి ప్రోత్సాహం అందిస్తే, జ‌గ‌న్ మాత్రం స‌బ్సిడీలు ఎత్తేసి సంక్షోభానికి కార‌కుల‌య్యారని ఆయ‌న చెప్పారు. ఆక్వారంగం ప‌ట్ల వైసీపీ ప్ర‌భుత్వం చూపిన నిర్ల‌క్ష్య వైఖ‌రి కార‌ణంగానే ఆక్వా రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆయ‌న అన్నారు.
 
ఇప్ప‌టికైనా క‌ళ్లుతెరిచి ఆక్వా రైతుల డిమాండ్లన్నింటినీ వెంట‌నే నెర‌వేర్చ‌క‌పోతే ప‌రిశ్ర‌మ‌లు, వ్య‌వ‌సాయ‌రంగ దారిలోనే ఆక్వా హాలీడే కూడా త‌ప్ప‌క‌పోవ‌చ్చని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments