Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ఠాగూర్
సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (16:52 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ దంపతులు ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు. త్రివేణి సంగమం షాహి స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానమాచరించి గంగాదేవికి పూజలు చేసి హారతులు ఇచ్చారు. 
 
ఆ తర్వాత అక్కడ నుంచి వారణాసికి చేరుకున్నారు. అక్కడ కాలభైరవ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత కాశీ విశాలాక్షి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం సాయంత్రం వారణాసి నుంచి బయలుదేరి విజయవాడ నగరానికి చేరుకుంటారు.
 
కాగా, ఈ నెల 26వ తేదీ వరకు మహాకుంభమేళా వేడుక జరుగనున్న విషయం తెల్సిందే. ఇప్పటికే 52 కోట్ల మందికిపై భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. విదేశాల నుంచి సైతం భక్తులు ఈ మహాకుంభమేళాకు తరలివస్తున్నారు. శత్రుదేశమైన పాకిస్థాన్ నుంచి హిందూ భక్తులు తరలిరావడం విశేషం. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments