Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

Advertiesment
monalisa

సెల్వి

, శనివారం, 8 ఫిబ్రవరి 2025 (20:37 IST)
ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా మారిన మోనాలిసా భోస్లే రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయింది. 16 ఏళ్ల ఈ యువతి తన ముదురు గోధుమ రంగు స్కిన్‌తో ఆకర్షణీయమైన కళ్ళతో చూపరులను ఆకర్షించింది. ఆమె ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయినాయి. ఈ క్రమంలో మోనాలిసా భోస్లేకు బాలీవుడ్ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. 
 
దర్శకుడు సనోజ్ మిశ్రా తన రాబోయే చిత్రం ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమా కోసం ఆమెను సంతకం చేయించారు. ఆమె ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం ఒప్పందంపై సంతకం చేసింది. ఈ తొలి చిత్రానికి ఆమె పారితోషికం గురించి ఇప్పుడు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. 
 
మోనాలిసా భోస్లే తన పాత్ర కోసం రూ.21 లక్షలు ఆఫర్ చేసినట్లు టాక్. అదనంగా, స్థానిక వ్యాపార ప్రమోషన్ల కోసం ఆమె రూ.15 లక్షల ఒప్పందంపై సంతకం చేసినట్లు సమాచారం. గతంలో పూసలు అమ్ముతూ రోజుకు రూ.1,000 సంపాదించిన మోనాలిసా భోస్లే ప్రస్తుతం లక్షల్లో సంపాదిస్తోందని.. అదే అదృష్టమని నెటిజన్లు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి