Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

Advertiesment
Camera team at shooting

దేవి

, శనివారం, 8 ఫిబ్రవరి 2025 (18:13 IST)
Camera team at shooting
సినిమా రంగంలో కెమెరా టెక్నీషియన్ పాత్ర కీలకం.అలంటి కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు జరిగాయి. వివరాల్లోకి వెళితే, గత 20 ఏళ్ళు గా అసోసియేషన్స్ లో జమాలెక్కలు లేవు. ఆడిటింగ్ లేదు. కొన్ని ఏళ్లుగా హుమాయూన్ జనరల్ సెక్రటరీ గా ఉంటున్నారు. ప్రసిడెంట్ సురేష్ ఉన్నారు. కోశాదికారిగా  రమేష్ ఉన్నారు. కోట్ల రూపాయల నిది ఉంది. అసోసియేషన్స్ అభివృధి శూన్యం. గత కొంత కాలంగా మీటింగ్ లు లేవు.  వైస్ ప్రెసిడెంట్ నాగబాబు తో పాటు పలువురు సభ్యులు అకౌంట్స్ అడగటంతో పలు సార్లు వాయిదా వేస్తూ ఉన్నారు. జనవరిలో జరిగిన జనరల్ బాడీ లో 8 కోట్లు లెక్కలు దారి తప్పాయని సభ్యులు ఆరోపించారు. 
 
అనంతరం వైస్ ప్రెసిడెంట్ నాగబాబు తో పాటు కోశాదికారి, ఆడిటర్ లు అసోసియేషన్స్ లెక్కలు చూస్తుండగా చిన్నపాటి రభస జరిగిందని సభ్యులు  తెలిపారు. లెక్కలు సరిగా లేవని వైస్ ప్రెసిడెంట్ నాగబాబు నిలదీయడంతో  జనరల్ సెక్రటరీ హుమాయూన్ సీరియస్ అయినట్లు తెలిసింది. అసలు లెక్కలు నువ్వెందుకు చూస్తున్నావని గొడవపడటం జరిగింది. ఇక ఆరోజు రాత్రి వైస్ ప్రెసిడెంట్ నాగబాబు పై రాత్రి కొందరు దాడి చేసారు. విషయం తెలిసిన మిగిలిన సభ్యులు పోలీస్ కేసు పెట్టారు.
 
కాగా,  హుమాయూన్ చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయని తెలిసింది. తెహర్ అవుట్ డోర్ యూనిట్ పేరుతో వ్యాపారం చేస్తూ, అసోసియేషన్ పేరు దుర్వినియోగం చేస్తున్నాడని ప్రదాన ఆరోపణ. తెలంగాణ కు చెందిన హుమాయూన్ కు రాజకీయ సపోర్ట్, ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభ నేని తోడుకావడంతో పలు అక్రమాలకు పాలపడుతున్నాడని సభ్యులు ఆరోపిస్తున్నారు.  అందుకే రేపు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు పోలీస్ పర్మిషన్ తేసుకున్నారు. దానిని వాయిదా వేసేలా ప్రుస్తుత కమిటి పావులు కదుపుతుందని సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్