Webdunia - Bharat's app for daily news and videos

Install App

చరిత్ర సృష్టించా.. అతిపిన్న వయసున్న మంత్రిని నేనే : నారా లోకేష్

దేశంలో సరికొత్త చరిత్ర సృష్టించానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. అతిపిన్న వయసులోనే మంత్రిపదవిని చేపట్టిన నేతగా రికార్డు సృష్టించానని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా, 34 ఏళ్

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2017 (14:25 IST)
దేశంలో సరికొత్త చరిత్ర సృష్టించానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. అతిపిన్న వయసులోనే మంత్రిపదవిని చేపట్టిన నేతగా రికార్డు సృష్టించానని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా, 34 ఏళ్ల వయసుకే తాను మంత్రి అవుతానని ఏనాడూ ఊహించలేదన్నారు. 
 
మంత్రి‌గా బాధ్యతలు చేపట్టిన అనంతం లోకేష్‌ తొలిసారిగా మంగళవారం ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా మార్టూరులో ఏర్పాటు చేసిన సభలో లోకేష్‌ మాట్లాడుతూ, గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 
 
చెత్త పేరుకుపోకుండా 2018 నాటికి రాష్ట్రంలోని 12,918 గ్రామాల్లో డంపింగ్‌ యార్డులు పూర్తి చేస్తామన్నారు. ఐదు వేల జనాభా ఉన్న గ్రామాల్లో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేపడతామన్నారు.  
 
పనిలోపనిగా విపక్ష నేత వైఎస్. జగన్మోహన్ రెడ్డిపైనా విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ నెలకు ఒక రోజు కూడా ఏపీ రాజధానికి రావడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలతో హైదరాబాదులో సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని వైసీపీ నేతలు అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 
 
దేశంలోనే జాతీయ ఉపాధి పథకాన్ని పూర్తిగా వినియోగించుకుంటున్న రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందందన్నారు. దీన్ని ఓర్వలేని వైకాపా ఎంపీలు ఉపాధి హామీ పథకానికి నిధులు రాకుండా కేంద్రానికి లేఖ రాశారని... అయితే, వాస్తవాలను గుర్తించిన కేంద్రం ఆ తర్వాత మళ్లీ నిధులను విడుదల చేసిందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments