Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌లా తల దించుకునే పనులు చేయను... అలా చేస్తే జైల్లో కూర్చుంటా... లోకేష్

తిరుప‌తి: నాపై ఆరోప‌ణ‌లు నిరూపిస్తే... నేనే జైలుకు వెళ‌తా... అంటూ యువ‌నేత లోకేష్ త‌న ఆవేద‌న‌ను వెళ్ళ‌గ‌క్కారు. మ‌హానాడులో ఆయ‌న ముగింపు స‌మావేశంలో మాట్లాడుతూ, నా తండ్రికి చెడ్డ‌పేరు తీసుకురాన‌ని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి, రాష్ట్ర ప్రజలకు నిబద్ధతతో

Webdunia
ఆదివారం, 29 మే 2016 (20:08 IST)
తిరుప‌తి: నాపై ఆరోప‌ణ‌లు నిరూపిస్తే... నేనే జైలుకు వెళ‌తా... అంటూ యువ‌నేత లోకేష్ త‌న ఆవేద‌న‌ను వెళ్ళ‌గ‌క్కారు. మ‌హానాడులో ఆయ‌న ముగింపు స‌మావేశంలో మాట్లాడుతూ, నా తండ్రికి చెడ్డ‌పేరు తీసుకురాన‌ని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి, రాష్ట్ర ప్రజలకు నిబద్ధతతో సేవ చేస్తానని, తన తండ్రి చంద్రబాబునాయుడికి చెడ్డపేరు తీసుకువచ్చే పనులు చేయబోనని యువనేత నారా లోకేష్ వాగ్దానం చేశారు. 
 
తనపై వైకాపా నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, దమ్ము, ధైర్యం ఉంటే ఒక్క ఆరోపణనైనా నిరూపించాలని సవాల్ విసిరారు. తెలంగాణలో కావాలనే టీడీపీని ఇబ్బంది పెడుతున్నారని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సీట్లు దక్కకపోయినా, టీఆర్ఎస్ తరువాత తెలుగుదేశం పార్టీకే అత్యధిక ఓట్ల శాతం వచ్చిందని గుర్తు చేశారు. టీడీపీ వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. 
 
జగన్ మోహన్ రెడ్డి మాదిరిగా తన తండ్రి తలదించుకునే పనులు చేయబోనని, ఒక్కసారి అవినీతికి పాల్పడినట్టు రుజువైనా స్వయంగా జైల్లోకి వెళ్లి కూర్చుంటానని చెప్పారు. కుట్ర‌ రాజకీయాల పట్ల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, విపక్షాలు వేసే వలలో చిక్కుకోవద్దని కోరారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments