Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ అంటే సీఎం అనే గౌరవం ఉండేది.. కానీ ఆయనో సైకో, శాడిస్ట్, డ్రగిస్ట్: లోకేష్

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (22:29 IST)
ఏపీలో టీడీపీ నేతల ఇళ్లు, పార్టీ కార్యాలయాలపై అధికార పార్టీ దాడులు చేయడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఆనవాయితీలను తుంగలో తొక్కి ప్రజాస్వామ్యానికి పాతరేసి జగన్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడని లోకేష్ ఫైరయ్యారు. ఆయన పతనానికి ఆయనే ఒక్కో ఇటుక పేర్చుకుంటున్నారని మండిపడ్డారు. 
 
తెలుగు దేశం కార్యకర్తల సహనాన్ని చేతకానితనం అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు జగన్ అంటే ముఖ్యమంత్రి అని గౌరవం ఉండేదని, కానీ ఆయన వికృతి బుద్ధి చూశాక సైకో, శాడిస్ట్, డ్రగిస్ట్ అని అంటున్నానని లోకేష్ వ్యాఖ్యానించారు. 
 
జగన్‌ను ఉరికించి కొట్టడానికి టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం లేదని, తమ క్యాడర్‌కు తమ అధినేత కనుసైగ చేస్తే చాలని లోకేష్ పేర్కొన్నారు. వైసీపీ కార్యాలయాలను ధ్వంసం చేయడం టీడీపీ కార్యకర్తలకు నిమిషం పని అన్నారు. 
 
ఫ్యాన్ రెక్కలు మడిచి పెయిడ్ ఆర్టిస్టులను రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టడానికి తమ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని లోకేష్ గుర్తుచేశారు. జగన్ బినామీలు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తే దాడులకు పాల్పడటం ఏంటని లోకేష్ ప్రశ్నించారు. పరిపాలన చేయమని ప్రజలు అధికారం ఇస్తే పోలీసుల సాయంతో మాఫియా సామ్రాజ్యం నడిపిస్తున్నారని లోకేష్ విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments