సీఎం జగన్ తిరుమల పర్యటనపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలేశుని కొండపై గోవిందనామాల బదులు జగన్ నామస్మరణ మహాపరాధం అంటూ లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. స్వామి అమ్మవార్లకు పదేపదే అపచారాలు తలపెడుతూ మళ్లీ.. జగన్‌రెడ్డిని రక్షించే గోవిందుడు అంటూ టిటిడి చైర్మన్ సతీమణి అపచారపు నామస్మరణ స్వామివారికి తీరని కళంకం అంటూ వ్యాఖ్యానించారు.
భక్తి వుంటే భార్య ఎందుకు రాదు? అంటూ లోకేష్ ప్రశ్నించారు. వేదపండితులు తలపై వేసిన అక్షతల్ని అసహ్యంగా దులుపుకోవడం… ప్రసాదం వాసన చూడటం… స్వామిపై ఎందుకీ దొంగ దైవభక్తి జగన్‌రెడ్డి గారూ? అంటూ లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు.
"మీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు ఏడుకొండలవాడి సేవచేసే అవకాశం దొరికితే…ఆ స్వామికే అపచారం తలపెట్టే పనులు మంచిది కాదు" అంటూ టీటీడీ ఛైర్మెన్ సుబ్బారెడ్డికి హితవు పలికారు. ఓ బాబాయ్‌కి గొడ్డలిపోటు కానుకగా ఇచ్చి.. బాబాయ్ కోటాలో మిమ్మల్ని.. ఈ స్కీంకి ఎంపిక చేయని అబ్బాయి మీ పాలిట దేవుడే కావొచ్చని.. ఆయన ఫోటో మీ ఇళ్లల్లో పెట్టి పూజించుకోండి.. దేవుడిగా కొలుచుకోండి.. వీలైతే పాదపూజ చేసుకోండి... అంటూ సెటైర్లు విసిరారు.