Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోకేష్‌ ఇక కుప్పం నీదే... చంద్రబాబు

తెలుగుదేశం పార్టీకి కంచుకోట కుప్పం నియోజవర్గం. ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో చంద్రబాబు గెలుస్తూనే వస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి కావడానికి కుప్పం నియోజకవర్గమే ప్రధాన కారణం.

Webdunia
ఆదివారం, 2 జులై 2017 (12:06 IST)
తెలుగుదేశం పార్టీకి కంచుకోట కుప్పం నియోజవర్గం. ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో చంద్రబాబు గెలుస్తూనే వస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి కావడానికి కుప్పం నియోజకవర్గమే ప్రధాన కారణం. ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా చంద్రబాబునాయుడు ఇక్కడి నుంచే గెలుపొందాడు. కుప్పం ప్రజలకు బాబు అంటే చాలా ఇష్టం. ఆయన నియోజవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలంటే ఇంకా ఇష్టం. అందుకే చంద్రబాబుకు ఎప్పుడు ఎన్నికల జరిగినా కుప్పం నుంచి భారీ మెజారిటీతోనే గెలుస్తుంటారు. అయితే ఈసారి ఆ ఛాన్సును తన కుమారుడు నారాలోకేష్‌ కు ఇవ్వనున్నారట బాబు. ఇప్పటికే ఒక ఆ నిర్ణయాన్ని లోకేష్ కూడా చెప్పారట బాబు. ఇక నుంచి కుప్పం నియోజవర్గంలో అభివృద్థి కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్థ పెట్టాలని సూచించారట.
 
ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని లోకేష్‌ ఉత్సాహంగా ఉన్నారు. ఈసారి ఎమ్మెల్యేగానో, ఎంపీగానో పోటీ చేయాలన్నది ఆయన ఆలోచన. అందుకే బాబు ఈ నిర్ణయం తీసేసుకున్నారట. కుప్పంలో అయితే నారా లోకేష్‌ విజయం సులువు అవుతుందని బాబు ఆలోచన. నారా కుటుంబంలో ఎవరైనా సరే ఆదరించేందుకు కుప్పం ప్రజలకు సిద్ధంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముందస్తు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నారా లోకేష్‌‌కు కుప్పం ఒక్కటే సరైన ప్రాంతమని నారా కుటుంబం మొత్తం ఒక నిర్ణయానికే వచ్చేసిందట. అయితే లోకేష్‌ కుప్పం నుంచి పోటీ చేస్తే చంద్రబాబునాయుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments