Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు పాదాభివందనం.. నారా లోకేష్ అనే నేను...

సెల్వి
బుధవారం, 12 జూన్ 2024 (13:25 IST)
Nara lokesh
2024 ఎన్నికల ప్రచారం నారా లోకేష్‌కు విశేషమైనది. చారిత్రాత్మకమైన యువగళం పాదయాత్రతో ఆయన ప్రచారం ప్రారంభమైంది. ఇది ఆయనను ప్రజలకు మరింత చేరువ చేసింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌లో మూడవ అతిపెద్ద మెజారిటీగా మంగళగిరిలో నారా లోకేష్ గెలుపును తన ఖాతాలో వేసుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో బుధవారం ఆయన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ‘నారా లోకేష్ అనే నేను’ అంటూ ప్రారంభించిన వెంటనే.. టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా పుంజుకున్నాయి. 
 
లోకేశ్ టీడీపీకి కాబోయే నాయకుడు అని, నాయకత్వ శ్రేణుల మధ్య ఏకగ్రీవ ఆమోదం లభించడం విశేషం. గతంలో 2014-19 మధ్య లోకేశ్ పంచాయత్ రాజ్, ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. నారా  లోకేశ్ తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకుని, ప్రమాణ స్వీకారం చేశారు. 
గవర్నర్ అబ్దుల్ నజీర్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులు కూడా అందుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలకు కూడా లోకేశ్ పాదాభివందనం చేసేందుకు యత్నించగా, వారు వద్దని సున్నితంగా వారించారు. రెండో పర్యాయం మంత్రిగా బాధ్యతలు అందుకోబోతున్న లోకేశ్ కు ప్రధాని మోదీ, అమిత్ షా, గడ్కరీ, జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

Blackbuck poaching case: కృష్ణ జింకల వేట కేసు: సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి కు షాక్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments