Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుగ్గిరాలలో నారా లోకేశ్‌పై వైకాపా శ్రేణుల రాళ్లదాడి

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (19:10 IST)
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామానికి చెందిన ఓ మహిళ సామూహిక అత్యాచారానికి గురైంది. ఆ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన నారా లోకేశ్‌పై వైకాపా శ్రేణులు రాళ్లతో దాడి చేశారు. దీంతో దుగ్గిరాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
 
హత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నారా లోకేశ్ వచ్చాడని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున ఒక్కసారిగా అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ, వైకాపా శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఆ తర్వాత వైకాపా శ్రేణులు లోకేశ్‌తో పాటు టీడీపీ కార్యకర్తలపై రాళ్లతో దాడి చేశారు. 
 
దీంతో నారా లోకేశ్ నిలుచున్న చోటే, ఆయనకు అతి సమీపంలో పెద్ద రాయి వచ్చి పడింది. ఈ రాయిని తీసుకున్న లోకేశ్ చూపుతూ పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. హ‌త్యాచార బాధితురాలి మృత‌దేహానికి శ‌వ ప‌రీక్ష జ‌ర‌గ‌క‌ముందే... ఆమెపై అత్యాచారం జ‌ర‌గలేద‌ని గుంటూరు అర్బ‌న్ ఎస్పీ ఎలా చెబుతార‌ని లోకేశ్ ప్ర‌శ్నించారు. అలా చెప్పాల‌ని ఎస్పీపై ఒత్తిడి చేశారా? అని ప్ర‌శ్నించిన లోకేశ్... స‌జ్జ‌ల అనే జీత‌గాడు ఎస్పీని ఒత్తిడికి గురి చేశారా? అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 
 
త‌మ‌ది పేటీఎం బ్యాచ్ కాద‌న్న లోకేశ్... త‌మ‌ది ఎల్లో బ్ల‌డ్ అని... ఏ ఒక్క‌రికీ భ‌యప‌డేది లేద‌ని తేల్చి చెప్పారు. హ‌త్యాచారంపై చ‌ర్య‌లు తీసుకునేందుకు వైసీపీ ప్ర‌భుత్వానికి 21 రోజులు గడువు ఇస్తున్నాన‌ని చెప్పిన లోకేశ్... 21 రోజుల్లోగా నిందితుల‌కు ఉరిశిక్ష వేయ‌గ‌ల‌రా? అని ప్ర‌శ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

Raviteja: రవితేజ మాస్ జాతర విడుదల ఆలస్యమవుతుందా?

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments