Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఎలాంటిదాన్నో నా భర్త నమ్మితే చాలు.. నారా భువనేశ్వరి ఉద్వేగం

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2023 (21:57 IST)
ఒక స్త్రీగా నేను ఎలాంటిదాన్నో ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదనీ నా భర్త నమ్మితే చాలు అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. నేను ఇలాంటిదాన్ని, అలాంటిదాన్ని అంటూ ఇష్టారీతిన కొందరు మాట్లాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసారు. తనకు మనస్సాక్షి ఉందని, వేరేవాళ్లు ఏం వాగినా తనకు అనవసరమని వ్యాఖ్యానించారు. స్త్రీలందరికీ తాను అదే సందేశం ఇవ్వాలనుకుంటున్నానని భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ నేతలు చేపట్టిన నిరసన దీక్షలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసే వారికి గట్టిగా బుద్ధి చెప్పారు. 
 
నేను ఒక స్త్రీనేండి. నాకు జరిగింది నేను ఎప్పుడూ మరిచిపోను. ఏంటి నా మీద చూపిస్తారు. నేను ఇట్లాంటిదాన్ని, అట్లాంటిదాన్ని అని. నేను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నాకు మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. అది మా ఆయన నమ్మితే చాలు. వేరేవాళ్లు ఏం వాగినా అది మనకు అనవసరం. ఇక్కడ ఉండే స్త్రీలందరికీ నేను అదే సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. మగాడు ఏదైనా మాట్లాడుతాండండీ.. అదేం పట్టించుకోవద్దు. అది పనిలేని వాళ్లు అట్లాగే వాగుతారు. వారు మరిచిపోతున్నారు. ఒక ఆడది తల్లి, భార్య అని. ఈ సృష్టికి మూలకర్త ఆడది అనే విషయం వారు మరిచిపోయారు అని ఉద్వేగంతో మాట్లాడారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments