Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 ఏళ్ల అమ్మాయిలో ఎన్టీఆర్ ఆత్మ... తనతో మాట్లాడిందన్న లక్ష్మీ పార్వతి

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (13:27 IST)
నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మీ పార్వతి అయన చనిపోయిన ఇన్ని ఏళ్లకు చిదంబర రహస్యం చెప్పారు. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు తాను ఆయన ఆత్మతో మాట్లాడానని వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి తెలిపారు. మంగళవారం ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి నివాళులు అర్పించారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘‘26 ఏళ్ల తర్వాత ఒక రహస్యం చెబుతున్నా. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఆయన ఆత్మతో మాట్లాడా. జీవిత రాజశేఖర్‌లు మద్రాస్ తీసుకెళ్లి ఒక అమ్మాయితో మాట్లాడించారు. ఎన్టీఆర్ ఆత్మ 16 ఏళ్ల  అమ్మాయిలో ప్రవేశించి నాతో అనేక విషయాలు పంచుకుంది.’’ అంటూ లక్ష్మీ పార్వతి సంచలన విషయం వెల్లడించారు.
 
 
ఏపీలో ఎన్టీఆర్ విగ్రహాలపై దాడుల గురించి మాట్లాడుతూ, ఆ పని ఎవరు చేసినా తప్పేనన్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేసి సీఎం జగన్ హుందాగా వ్యవహరించారని లక్ష్మీ పార్వతి కితాబిచ్చారు. దుర్గి ఘటనపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మాట్లాడి వాస్తవాలు తెలుసుకున్నానన్నారు. ప్రతిపక్షాలు కూడా హుందాగా వ్యవహరించాలని సూచించారు. ఎన్టీఆర్ చల్లని చూపు తెలుగు ప్రజలపై ఉండాలని, ముఖ్యమంత్రుల హృదయాల్లో ఎన్టీఆర్ ఆత్మ ప్రవేశించాలని లక్ష్మీ పార్వతి కోరారు. ఐతే ఎన్టీఆర్ అత్మ చెప్పిన రహస్యాలు ఏంటి అనేది లక్ష్మీ పార్వతి స్పష్టంగా చెప్పలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తారక్ అద్భుతమైన నటుడు : ఎస్ఎస్ రాజమౌళి

Madhuram: తినడం మానేసి కొన్ని రోజులు నీళ్లు మాత్రమే తాగాను : ఉదయ్ రాజ్

డా. చంద్ర ఓబులరెడ్డి ఆవిష్కరించిన ఏ ఎల్ సీ సీ. ట్రెయిలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments