Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాజీ మంత్రి దేవినేని ఉమాకు చెక్... మైలవరం టికెట్ ఈసారి కష్టమే

Advertiesment
political check
విజ‌య‌వాడ‌ , మంగళవారం, 18 జనవరి 2022 (12:59 IST)
కృష్ణ జిల్లాలో ముఖ్యంగా నందిగామ, మైలవరం నియోజకవర్గాలలో రెండు దశాబ్దాల పాటు రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు రాబోయే కాలంలో రాజకీయంగా చెక్ పడేటట్లు కనిపిస్తోంది. ఇటీవల ఇద్దరు నాయకులు నియోజకవర్గ పరిధిలో కార్యక్రమాలు విస్తృత చేయడంతో పాటు ఇదే నియోజకవర్గానికి చెందిన వారు కావడంతో వారికి మద్దతు పెరుగుతోంది.


అంతే కాకుండా ఇటీవల జరిగిన కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయంలో వారు కీలకపాత్ర పోషించారు.  దీనితో వారికి పార్టీ అధిష్టానం వద్ద క్రేజ్ పెరిగినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే రాబోయే ఎన్నికల్లో వారు కూడా మైలవరం సీటు అడిగే అవకాశం లేకపోలేదు.
 
 
2009, 2014 సాధారణ ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా దేవినేని ఉమామహేశ్వరరావు గెలిచారు. 2019లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం లో ఆయన భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసి కీలకంగా వ్యవహరించారు. అసెంబ్లీలో ప్రభుత్వ వాదనలు వినిపించడంలో ముందున్నారు. అంతే కాకుండా టీడీపీ ప్రభుత్వం కీలకంగా భావించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి తీవ్రంగా కృషి చేశారు. అదే సమయంలో నిధులు అక్రమంగా దోచుకున్నారని ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురుకున్నారు. అనుకూలమైన వారికి కాంట్రాక్టులు ఇచ్చి వారి నుంచి లబ్ధి పొందినట్లు ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా గతంలో విమర్శలు చేశారు. ఇవి కూడా ఓటమికి కారణాలు కావచ్చనే భావన వ్యక్తమవుతోంది.
 
 
మైలవరం నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నాయకులు కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేయడంతో అధిక వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో వారిపై అధిష్టానం మెచ్చుకునట్లు తెలుస్తోంది. ఒక నాయకుడు మేజర్ పంచాయతీ పంచాయతీ సర్పంచ్ గా కూడా పనిచేసి ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. మరో నాయకుడు గతంలో వైసీపీ లో పని చేసి నియోజకవర్గ వ్యాప్తంగా మంచి సంబంధాలు కలిగి ఉండటంతో పాటు పలువురికి ఆర్ధికంగా సాయం కూడా చేశారు. గత ఎన్నికల సమయంలో ఆయన కూడా టీడీపీలో చేరారు. మరోవైపు దేవినేని ఉమామహేశ్వరరావు నందిగామ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఆయన పట్ల వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. 
 
 
అంతే కాకుండా కృష్ణా జిల్లాకు చెందిన ఒక మాజీ ప్రజా ప్రతినిది చంద్రబాబుకు చాలా దగ్గరగా ఉంటాడు. ఆయన మద్దతు కూడా ఒక్కరికి ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో సీట్ ఇప్పిస్తానని కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఉమాకు రాబోయే ఎన్నికల్లో సీట్ ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదు.
 
 
మైలవరం నియోజకవర్గానికి చెందిన  ద్వితీయ శ్రేణి నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావుకు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రిగా ఉన్న సమయంలో తమను పట్టించుకోలేదని ఆగ్రహంగా ఉన్నారు. కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు నామినేషన్ పద్దతిలో చేసిన కాంట్రాక్టు పనులకు బిల్లులు రాకపోవడంతో వారు ఆర్థికంగా బాగా నష్టపోయారు. అంతే కాకుండా కొంతమంది నాయకులు తమ సొంత ఆస్తులను తాక్కట్టు పెట్టిమరి పనులు చేశారు. వారు బిల్లులు కాకపోవడంతో వారు వాటిని కోల్పోవాల్సి వచ్చింది. కొంత మంది ఇప్పటికి కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. వారిని ఆదుకోకపోవడంతో ఆయన పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆయనకు సీట్ ఇస్తే సహకరించకపోవచ్చు.
  
 
మరోవైపు దేవినేని ఉమామహేశ్వరరావు గౌరవ సభల పేరుతో ఇప్పటి నుంచే నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల్లో పర్యటిస్తూ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలుకు వివరిస్తున్నారు. అంతే కాకుండా కొద్ది రోజుల తర్వాత నియోజకవర్గంలో పాదయాత్ర చేసేందుకు ప్రణాళిక వేసుకుంటునట్లు తెలిసింది. ఆ ఇద్దరూ నాయకులు కూడా వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాల పై పోరాటాలు కూడా చేస్తున్నారు. టీడీపీ అధిష్టానం ఉమాకు తిరిగి టికెట్  ఇస్తుందా,  లేక ఆ ఇద్దరు నాయకుల్లో ఒకరికి ఇస్తుందో వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాబుకు వచ్చిన కరోనా తగ్గిపోతుంది.. ఎన్టీఆర్‌కు పొడిచిన వెన్నుపోటు మాత్రం...