Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్‌ను కలుస్తా.. బాలయ్య ఆసక్తికర కామెంట్స్

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (14:26 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలుస్తానని నందమూరి హీరో బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ప్రకటన నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని స్థానికంగా డిమాండ్ వ్యక్తమవుతోంది. 
 
కొత్తగా ఏర్పాటు చేయనున్న శ్రీ సత్యసాయి జిల్లాకు పుట్టపర్తి కాకుండా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సీఎం జగన్‌ను కలిసేందుకు సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. 
 
ఇప్పటికే హిందూపురం జిల్లా ఉద్యమానికి మద్దతు పలికి.. పోరాటాన్ని విస్తృతం చేశారు బాలయ్య. శనివారం అఖిలపక్ష నేతలతో కలిసి.. హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలని కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. 
 
ఈ సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూపురం జిల్లా కేంద్రంగా చేసేంతవరకు ఎంత వరకైనా పోరాటం చేస్తామని ప్రకటించారు. అందుకోసం అవసరమైతే సీఎం జగన్‌‌ను కలుస్తానంటూ పేర్కొన్నారు.
 
సత్యసాయి జిల్లాకు తాము వ్యతిరేకం కాదని.. హిందూపురం జిల్లా కేంద్రం చేయాలన్నదే తమ డిమాండ్ అని పేర్కొన్నారు. ఎన్టీ రామారావు మీద ప్రేమతో ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేయలేదని.. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయంటూ బాలకృష్ణ పేర్కొన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments