Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ, ఛార్మీ, విజ‌య్ దేవ‌ర‌కొండ టీమ్ తో బాల‌య్య భేటీ!

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (10:46 IST)
ఎవ‌రూ ఊహించ‌ని ఎంట్రీలు ఇవ్వ‌డం న‌ట సింహం బాల‌య్య బాబుకు అల‌వాటు. పైగా ఆయ‌న‌ను పైసా వ‌సూల్ లో ... ఒక రేంజ్ లో చూపించిన పూరీ జ‌గ‌న్నాధ్ అంటే, బాల‌య్య‌కు మ‌హా ఇష్టం. నేను తేడా... తేడా సింగ్ అంటూ, ఊర మాస్ గా త‌న‌ని చూపించిన పూరీ అంటే, అందుకే బాల‌య్య‌కు ఇష్టం. ఆయ‌న కొత్త‌గా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా ఎలా ఉంటుందో అనే ఆత్రుత బాల‌య్య‌లో ఉంది. అందుకే పూరీ టీమ్ ని ఆయ‌న త‌ర‌చూ క‌ల‌వాల‌ని కోరుకుంటారు.
 
విజయ దేవరకొండ హీరోగా, పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో 'లైగర్‌' స్పోర్ట్స్‌ కథగా రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టీంకు నటుడు నందమూరి బాలకృష్ణ సర్ప్రైజ్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ గోవాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ 'లైగర్‌' సెట్‌ను సందర్శించారు. బాలయ్య అక్కడ కనిపించడంతో మేకర్స్‌తో పాటు విజయ దేవరకొండ సైతం ఆశ్చర్యపోయారు. ఆ తరువాత అనుకోని అతిథిలా వచ్చిన ఆయనతో మాట్లాడి ఫోటోలకు ఫోజులిచ్చారు. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి, ఛార్మి, కరణ్‌ జోహార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెట్ కి వెళ్ళి, చార్మీ, పూరీ, విజ‌య్ ల‌తో బాల‌య్య చాలా జోవియ‌ల్ గా గ‌డిపి వ‌చ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments