Webdunia - Bharat's app for daily news and videos

Install App

స‌మంతతో విడాకుల‌పై... నాగ చైత‌న్య వైరాగ్యం!

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (15:31 IST)
తెలుగు ఫిలి ఇండ‌స్ట్రీ హాట్ క‌పుల్ ...స‌మంత‌- నాగ చైత‌న్య విడాకుల వ్య‌వ‌హారం సినీ ప్రియుల‌ను హీటెక్కిస్తోంది. అస‌లు అది నిజ‌మా కాదా? ఎందుకు ఇద్ద‌రూ రెస్పాండ్ కావడం లేద‌ని అంతా ఒకింత ఆందోళ‌న‌తో ఉన్నారు. ప్రేమించి, పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోతారనే వార్తల‌ను చాలా మంది, ముఖ్యంగా మ‌హిళ‌లు తట్టుకోలేకపోతున్నారు. 
 
సామ్, చైతుల విడాకులకు సంబంధించి సోష‌ల్ మీడియాలో రోజుకో కథనం వ‌స్తోంది. ఇది నిజ‌మేనా అని స‌మంత‌ని అడిగితే, తిరుమ‌ల కొండ‌పై, ఆల‌యంలో ఉన్నాం... మీకు బుద్ధి ఉండ‌క్క‌ర్లేదా? అన్న‌ట్లు స‌మంత చాలా సీరియ‌స్ గా స్పందించింది. ఇక చైతు అయితే అస‌లు నోరే విప్ప‌డం లేదు.
 
ఇక చైతూ న‌టించిన ల‌వ్ స్టోరీ చిత్రం ఈ రోజు విడుద‌ల అయింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లో విడాకుల గురించి వ‌స్తున్న వార్త‌ల‌పై చైతు నోరు విప్పాడు కానీ, అస‌లు ఏం జ‌రుగుతోంద‌నేది మాత్రం స్ప‌ష్టం కాలేదు.
 
తీవ్రస్థాయిలో వస్తున్న పుకార్లను చూసి మొదట్లో కొద్దిగా బాధపడ్డా... ఇలాంటి వార్తలు ఎలా రాస్తారు? అని వేదనకు గురయ్యేవాడిన‌ని చైతు పేర్కొన్నారు. పాత రోజుల్లో మాస పత్రికలు ఉండేవి, వాటిలో ఓ వార్త రాస్తే నెలంతా అదే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కొద్ది సేపట్లోనే ఒక వార్తను తోసేసి మ‌రో వార్త‌ను పుట్టిస్తున్నార‌ని వ్యాఖ్యానించాడు. 
 
ఇప్పుడు ఎన్ని పుకార్లు వ‌చ్చినా, ప్ర‌జ‌లు నిజాలే గుర్తుంచుకుంటున్నార‌ని అన్నాడు. అయితే గాసిప్స్ కోసం తన పేరును వాడుకుంటుండడం బాధాకరమని పేర్కొన్నాడు. ప్రతి వ్యక్తికి వృత్తిపరమైన జీవితం, వ్యక్తిగత జీవితం ఉంటాయని నాగ చైతన్య అభిప్రాయపడ్డారు. తన తల్లిదండ్రులను గమనించడం ద్వారా వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని విడివిడిగా చూడడం అలవర్చుకున్నానని తెలిపారు.
 
నా త‌ల్లిదండ్రులు షూటింగ్ ముగించుకొని వ‌చ్చిన త‌ర్వాత, బ‌య‌ట విషయాలు ప‌ట్టించుకోరు. ఇదే నేనూ  అల‌వ‌ర్చుకున్నా అంటూ చైతూ తెలియ‌జేశారు. అయితే సమంత-నాగచైతన్య విడిపోవడానికి ప్రధాన కారణం పెళ్లి తర్వాత కూడా ‘సమంత’ పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో బోల్డ్ గా నటించడమే అని అంటున్నారు. అక్కినేని కుటుంబంలో కోడలు అయ్యిండి అలా నటించడంపై వారంతా అభ్యంతరం తెలిపారని స‌మాచారం. ఇదే వారిద్ద‌రి మ‌ధ్య దూరాన్ని పెంచుతోంద‌ని పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments