Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామీణ ప్రాంతాలలో పని చేసేందుకు ఆసక్తి చూపాలి: మంత్రి పేర్ని నాని

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (07:16 IST)
గ్రామీణ ప్రాంతాలలో పని చేసేందుకు కొందరు సచివాలయ ఉద్యోగులు ఆసక్తి చూపడం లేదని వారు పట్టణ ప్రాంతాలకు తమను బదిలీ చేయమని స్థానిక ప్రజాప్రతినిధులపై వత్తిడి తీసుకురావడం తరుచూ జరుగుతుందని ఆ తరహా చర్యలు  భావ్యం కాదని రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని నాని సూచించారు.

తన కార్యాలయంకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను మంత్రి పేర్ని నాని కలిసి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొన్నారు. తొలుత ఒక మహిళ తన కుమారుడు కలిదిండి సంతోష్ బాబు సమీప ఊరిలో గ్రామ సచివాలయంలో వాలంటీర్ గా గత రెండేళ్లుగా పని చేస్తున్నాడని ఇటీవల తన కుమారునికి జ్వరం రావడంతో ఆరోగ్యం బాగోనండటం లేదని మచిలీపట్నం వార్డు సచివాలయంకు బదిలీ చేయాలనీ అభ్యర్ధించింది. 

ఈ  విషయమై స్పందించిన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ప్రొబిషన్ పిరియడ్ లో ఒక ప్రాంతం నుంచి మరో చోటుకు మార్చడం కుదరదని, అబ్బాయికి ఉద్యోగం రాగానే , తనను కల్సి విషయం చెప్పినట్లయితే, నాడే ఆ పని సాధ్యమయ్యేదని , బ్యాన్ లిఫ్ట్ చేస్తేనే ట్రాన్స్ఫర్లు మొదలవుతాయని అన్నారు.

ఇటీవల మచిలీపట్నంలో ఒక సచివాలయ ఉద్యోగిని వేరే వార్డుకు బదిలీ చేసినందుకు పైస్థాయి నుంచి హెచ్చరికలు వచ్చాయని అలా వ్యవహరించవద్దని సూచనలు గట్టిగా అందుకొన్నామని మంత్రి తెలిపారు.  రాష్ట్రంలోని 16,208 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు రాత పరీక్షలలో  విజేతలుగా నిలిచిన మీరు మరింత బాధ్యతతో విధులు నిర్వహించాలని మంత్రి పేర్ని నాని కోరారు.   

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఆర్టీసీ డిపో  నుంచి కొందరు డ్రైవర్లు మంత్రి వద్ద తమ  ఇబ్బందిని చెప్పుకొన్నారు. తమకు నేత్ర సంబంధిత వ్యాధులు ఉన్నందున ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగానికి పనికిరామని నల్గురు డ్రైవర్లను తమ ఉన్నతాధికారులు ఆన్ ఫిట్ చేసారని, తమకు ప్రత్న్యమయంగా ఆర్టీసిలోనే ఏదైనా ఉద్యోగం చూపించాలని జన్నుపల్లి చిన్నా, బాలకృష్ణ, ఎం. ప్రసాద్ లు అభ్యర్ధించారు.  

స్థానిక ఆదర్శనగర్ కు చెందిన పల్లె రాంబాబు మంత్రికి తన ఎనిమిదేళ్ల కుమారుడు ప్రవీణ్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని వైద్యం నిమిత్తం లక్షలు ఖర్చు అవుతుందని తనకు అంతటి ఆర్ధిక స్తోమత్తు లేదని తెలిపారు.  వైద్య పరీక్షల కోసం ఒక్కసారి ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని సూచించారు. తాను అక్కడ వైద్యురాలితో మాట్లాడేనని తెలిపారు.                     

సైకిల్ పై వెళుతున్న తన కుమారుడిని ఒక రౌడీ నిలబెట్టి లెంపలు వాయించి జేబులో చెయ్యిబెట్టి డబ్బులు బలవంతాన లాకొంటున్నాడని తనకు ఎవరూ లేరని ఒక అన్నయ్యగా మిమ్మలిని భావించి తన కుమారునికి రక్షణ కల్పించామని అడిగేందుకు వచ్చేనని మంత్రికి తెలిపింది. ఈ  విషయమై మంత్రి పేర్ని నాని వెంటనే స్పందించి స్థానిక ఇనగుదురుపేట ఎస్ ఐ కు ఫోన్ చేసి ఆ  ఆకురౌడీ వ్యవహారం చూడాల్సిందిగా ఆదేశించారు.       

ఇటీవల చిలకలపూడిలో రోడ్డు విస్తరణ సమయంలో రోడ్డు పక్కన తొలగించిన స్ధలాలు ఎక్కడ ఇస్తున్నారని కొందరు మహిళలు మంత్రిని అడిగారు. వెంటనే స్పందించిన ఆయన స్థానిక అహసిల్దార్ సునీల్ బాబుతో మాట్లాడి వారికి నిర్దేశించిన స్ధలాలు ఈరోజే అందచేయాలని ఆదేశించారు. అలాగే లాటరీ పడ్ఢతిలో చీటీలు వేసి ఒక్కో స్థలాన్ని వారికి కేటాయించాలని ఇందులో ఎటువంటి వివాదాలు తలెత్తకుండా దగ్గరుండి పరిష్కరించాలని మంత్రి పేర్ని నాని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

తర్వాతి కథనం
Show comments