Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా... పురపాలక పాఠ‌శాల‌ల‌ టీచర్ల నిరసన

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (11:33 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని మెుత్తం 2,115 పురపాలక పాఠశాలల్లో 1,675 ప్రాథ‌మిక పాఠశాలల తరగతుల విలీన ప్రక్రియ నిలుదల చేయాల‌ని ఉపాధ్యాయులు డిమాండు చేస్తున్నారు. విద్యాశాఖ ఆ విలీన ప్రక్రియను పంచాయితీ పాఠశాలకు లాభంగాను, పట్టణాలలో ఆచరణ ఆమోదయోగ్యం కాని నిభందనలు తయారు చేశార‌ని ఆరోపిస్తున్నారు.  
 
 
దీనిపై రాష్ట వాప్తంగా పురపాలక టీచర్ల నిరసన కార్యక్రమమాలలో అన్ని జిల్లాలోని పురపాలక టీచ‌ర్లు  వేల సంఖ్యలో పాల్గొన్నారు. పురపాలక పాఠశాలల్లో 3,4,5 తరగతుల విలీన కార్యక్రమాన్ని వెంటనే నిలుపుదల చేయాల‌ని, పురపాలక హైస్కూల్ పాఠశాలలు ఇప్పటికే కిక్కరిసి తరగతి గదులతో 800 నుండి 1000 విద్యార్థులతో నిండిపోయి ఉండటం వల్ల‌, విద్యాబోధ‌న‌కు ఇది న‌ష్ట‌మ‌ని వివ‌రించారు. 
 
 
ప్ర‌తి 4 పురపాలక ప్రాథ‌మిక పాఠశాల నుండి వచ్చే, కొత్తగా 3 నుండి 5 తరగతి చదివే 400నుండి 600 విద్యార్థులకు ప్రతి పురపాలక హైస్కూల్ చోటు క‌ల్పించ‌లేరు. ఏవిధమైన స్దలం వసతి సౌకర్యాలు స‌రిపోవు. పైగా టీచర్ల కొరత, గదుల కొరత, భోజన వసతి కొర‌త ఎదుర‌వుతాయి. ఈ విలీన కార్యక్రమం పట్టణ, నగర పాఠశాలలకు నష్టం చేకూర్చేలా ఉంటుంది. 
 
 
దీనిపై మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మున్సిపల్ ఉపాధ్యాయులు నిర‌స‌న‌లో పాల్గొన్నారు. తమ నిరసన రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యాశాఖకు తెలియజేస్తూ, దీనిపై పునః పరిశీలించి పురపాలక పాఠశాలలో విలీన ప్రక్రియ నిలుదల చేయాల‌ని డిమాండు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments