Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముద్రగడ గృహ నిర్భంధంతో నివురుగప్పిన నిప్పులా తూర్పుగోదావరి... ఏం జరుగుతుంది?

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన ‘కాపు సత్యాగ్రహ యాత్ర’ను రాష్ట్ర ప్రభుత్వం భగ్నం చేయడంతో తూర్పు గోదావరి జిల్లా నివురుగప్పిన నిప్పులా మారింది. గత ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్రలో కాపులను బీసీలోకి చేర్చుతామని, కాపు కార్ప

Webdunia
గురువారం, 17 నవంబరు 2016 (17:08 IST)
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన ‘కాపు సత్యాగ్రహ యాత్ర’ను రాష్ట్ర ప్రభుత్వం భగ్నం చేయడంతో తూర్పు గోదావరి జిల్లా నివురుగప్పిన నిప్పులా మారింది. గత ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్రలో కాపులను బీసీలోకి చేర్చుతామని, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా రూ. 1000 కోట్లను కాపు సంక్షేమం కోసం కేటాయిస్తామని ఇచ్చిన హామీ అమలు కోసం ముద్రగడ గత జనవరి నెలాఖరులో తుని నుంచి పోరుబాట పట్టారు. అప్పటి నుంచి తనదైన పంథాలో ఆందోళన సాగిస్తున్న ఆయన గాంధేయ మార్గంలో పాదయాత్రను కాపు సత్యాగ్రహ యాత్ర పేరిట బుధవారం నుంచి శ్రీకారం చుట్టడానికి సమాయత్తం అయ్యారు. 
 
ఐతే శాంతిభద్రతల నెపంతో పోలీసులు రావులపాలెం యాత్రకు బయలుదేరిన ముద్రగడను ఇంటివద్దే మంగళవారం సాయంత్రం అడ్డగించి గృహ నిర్బంధం చేసిన విషయం విదితిమే. కిర్లంపూడికి వచ్చే అన్ని మార్గాల్లో పోలీసు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మరోవైపు ముద్రగడ ఇంటి ముందు గుడారాలు, శిబిరాలు ఏర్పాటు చేయడంతో పోలీసులు భారీగా మోహరించారు. డ్రోన్లు, బెల్ట్‌ కెమేరాలతో ముద్రగడ ఇంటి ప్రాంతాన్ని నిఘాలో ఉంచారు. తమ నేతను చూసేందుకు కూడా పోలీసులు అనుమతిని ఇవ్వకపోడంతో తీవ్ర ఆందోళన చెందుతున్న కిర్లంపూడి, జగపతినగరం గ్రామస్తులు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. 
 
వారపు సంత కూడా జరగలేదు. ముద్రగడను పరామర్శించడం కోసం వెళుతున్న వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, జక్కంపూడి రాజా ప్రభృతులను అరెస్టుచేసి సాయంత్రం వరకు పోలీస్‌స్టేషనులో నిర్బంధించారు. తర్వాత అంబటిని గుంటూరుకు బలవంతంగా తరలించారు. ముద్రగడ పద్మనాభంను మంగళవారం నుంచి పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. దీంతో తూర్పు గోదావరి జిల్లా నివురుగప్పిన నిప్పులా ఉంది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments