Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంతకాలం భరిస్తాం.. కన్నకొడుకైనా ఫర్వాలేదు.. చంపేయండి.. ఓ తల్లి

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (19:26 IST)
కరోనా లాంటి రోగాలొచ్చినా.. మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. మనుషుల్ని మనుషులే చంపుకు తింటున్నారు. ఫలితంగా నేరాల సంఖ్య అమాంతంగా పెరిగిపోతోంది. తాజాగా కన్నతల్లే తన బిడ్డను పొట్టనబెట్టుకుంది. 
 
కన్నకొడుకి దుర్వ్యసనాలు, వేధింపులు తట్టుకోలేక కన్న తల్లే కిరాయి గూండాలతో హత్య చేయించింది. నాలుగు నెలల క్రితం జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా పొన్నలూరులో దారుణం జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా పొన్నలూరుకు చెందిన నర్సింగరావు నాలుగు నెలల క్రితం హత్యకు గురయ్యాడు. కందుకూరు మండలం దూబగుంట వద్ద దుండగులు వ్యక్తిని హత్య చేసి పూడ్చి పెట్టారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
పొన్నలూరులో ఉన్న నర్సింగరావు తల్లి లక్ష్మమ్మను ప్రశ్నిస్తే.. తన కుమారుడు హైదరాబాద్​ కూలీ పనులకు వెళ్లాడని.. అతనికి ఫోన్​ కూడా లేదని పోలీసులను నమ్మించింది. ఆమె బంధువులు, చుట్టుప్రక్కల గ్రామాల్లో రౌడీ షీటర్లపై నిఘా ఉంచిన పోలీసులు కేసును ఛేదించారు. 
 
నర్సింగరావు దుర్వ్యసనాలకు బానిసై తల్లిని వేధించడం వల్లే.. లక్ష్మమ్మ కుమారుణ్ని హతమార్చాలని భావించింది. హత్య చేయడానికి రౌడీ షీటర్లతో రూ.1.70 లక్షలతో సుపారీ కుదుర్చుకున్నారు. అందులో రూ.50 వేలు చెల్లించారు.
 
నర్సింగరావుకు మద్యం తాగించి దూబగుంటకు తీసుకెళ్లి నరికి చంపి.. పూడ్చిపెట్టారు. మిగిలిన డబ్బు కోసం తేడా రావడం వల్ల హత్య వ్యవహారం బయటపడింది. ఈ కేసులో తల్లి సహా మొత్తం 8 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సిద్దార్ధ కౌశల్​ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments