Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయల చెరువు పరిధిలో ప్ర‌జ‌ల‌కు హెలికాప్ట‌ర్లో సాయం!

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (13:08 IST)
చిత్తూరు జిల్లాలో భారీ వ‌ర్షాల‌కు పొంగిపొర్లుతున్న‌ రాయల చెరువు పరిధిలో ముంపు గ్రామాల‌కు హెలికాప్ట‌ర్ ద్వారా సాయం అందిస్తున్నారు. వ‌రద ముంపు ప్రాంతాలలో బాధితులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సత్వర సాయం అందించే ప్ర‌య‌త్నం చేశారు. 
 
 
నేవీ హెలికాప్టర్ ద్వారా స్వయంగా ప్రయాణించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, హర్షిత్ రెడ్డి నిత్యావసర సరుకుల సరఫరా చేస్తున్నారు. రాయల చెరువు పరిసర ప్రాంతంలో నేవీ హెలికాఫ్టర్ లో ఏరియల్ సర్వే ద్వారా వరద నీటితో నిండిన మునక గ్రామాలను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పరిశీలించారు. 

 
రామచంద్రాపురం  మండలంలోని సి- కాలేపల్లి, చిట్టత్తూరు, రాయలచెరువు, పుల్లమనాయుడు కండ్రిగ, తిరుపతి రూరల్ మండలం వినాయకనగర్ కాలనీలలోని నిర్వాసితులకు నేవీ హెలికాప్టర్ ద్వారా బియ్యం, పప్పు, నూనె వంటి నిత్యావసర సరుకులను అందజేస్తున్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి తానే స్వ‌యంగా నిత్య‌వాస‌రాల‌ను ముంపు బాధితుల‌కు స‌ర‌ఫ‌రా చేస్తూ, అక్క‌డి ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments