Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌కు బుర్ర లేదు.. అది రైతు భరోసా యాత్ర కాదు బురద యాత్ర: భూమా నాగిరెడ్డి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి గోడదూకిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి.. వైకాపాపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన భూమానాగిరెడ్డి ఇటీవల తెలుగుదేశం పా

Webdunia
సోమవారం, 9 జనవరి 2017 (15:38 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి గోడదూకిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి.. వైకాపాపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన భూమానాగిరెడ్డి ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై భూమా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. 
 
జగన్మోహన్ రెడ్డికి నాయకత్వ లక్షణాలు లేవని ఎద్దేవా చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై జగన్‌ చేసిన ఆరోపణలు ఖండిస్తున్నానని భూమానాగిరెడ్డి చెప్పారు. వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు పార్టీ మారితే జగన్‌ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రైతులను రెచ్చగొట్టేందుకే జగన్‌ రైతుయాత్ర చేస్తున్నారని విమర్శించిన భూమా, ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌ చాలా గొప్పదని కితాబిచ్చారు.
 
ఇక వైఎస్సార్ హయాంలో జరిగిన జలయజ్ఞంలో భారీగా అక్రమాలు జరిగాయని, తాను పీఏసీ చైర్మన్‌గా ఉన్నప్పుడు ఆధారాలన్నీ సేకరించానని భూమా చెప్పారు. జలయజ్ఞంలో జరిగిన అక్రమాలపై బహిరంగ చర్చకు ఎవరైనా రావచ్చునని, పట్టిసీమ ద్వారా రాయలసీమకు చాలా ప్రయోజనాలున్నాయని భూమా వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డికి బుర్ర పనిచేయట్లేదని, రైతు భరోసా యాత్రను బురద యాత్రగా భూమా అభివర్ణించారు. 
 
గతంలో వైకాపాలో ఉన్నప్పుడు పట్టిసీమ గురించి విమర్శించానని.. ప్రస్తుతం పశ్చాత్తాపం పడుతున్నానని తెలిపారు. గోదావరి నీటిని కృష్ణానదికి తరలించడం ద్వారా కోస్తాకు నీటి కష్టాలు తీరాయని.. పట్టిసీమతో నీటి నిలువ పెరిగిందని చెప్పారు. శ్రీశైలంలో నీటి నిలువ పెరగడంతో రాయలసీమలోని ప్రాజెక్టులను నింపగలిగామని తెలిపారు. 2019లోపు పోలవరాన్ని పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments