Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్‌స్టా పరిచయం.. ముగ్గురు యువకుల కోసం మైనర్ బాలికలు వెళ్లారు.. చివరికి?

సెల్వి
శుక్రవారం, 24 జనవరి 2025 (20:26 IST)
ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. మైనర్ బాలికలను రోడ్డున పడేసింది. అయితే పోలీసుల ప్రమేయంతో మైనర్ బాలికలు కనుగొనబడ్డారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన పరిచయంతో యువకుల కోసం తెనాలికి ముగ్గురు మైనర్ బాలికలు వెళ్లారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఇన్‌స్టాగ్రాంలో పరిచయం చేసుకున్న ఆగంతుకులే ఈ ముగ్గురు మైనర్‌ బాలికలను ఏక కాలంలో ప్రలోభపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. 
 
దీంతో వేగంగా పావులు కదిపిన పోలీసులు గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని ఓ ప్రాంతంలో ముగ్గురు అమ్మాయిలను గుర్తించారు. వీరితో పాటు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. 
 
బాలికలను తెనాలి నుంచి ఇతర ప్రాంతానికి తరలించే ఏర్పాట్లను ఆ ఇద్దరు యువకులు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మైనర్ బాలికలను తమ అదుపులోకి తీసుకున్న పోలీసులు, శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఆ బాలికలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. 
 
ఈ మేరకు అదుపులోకి తీసుకున్న ఇద్దరు యువకుల వద్ద జరిపిన దర్యాప్తులో అమ్మాయిలను విజయవాడ నుంచి బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ముగ్గురు బాలికలు అజిత్​సింగ్ నగర్​లోని కొత్త రాజరాజేశ్వరిపేటకు చెందిన వారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamal: కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ చెన్నై, హైదరాబాద్‌లో ఆడియో, విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్

Samantha: రాజ్ నిడిమోరు-సమంతల ప్రేమోయణం.. శ్యామిలీ భావోద్వేగ పోస్టు

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments