Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధాశ్రమంలో బాలికపై అత్యాచారం... మరో ఇద్దరు సిబ్బంది కూడా...

హైదరాబాద్, నాగోల్‌ బండ్లగూడలోని రామకృష్ణ వృద్ధాశ్రమంలో పనిచేస్తున్న ఓ బాలికపై అదే హోంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అత్యాచారనికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న మరో ఇద్దరు కూడా అమెపై రేప్ చేశారు. బాధిత

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (10:19 IST)
హైదరాబాద్, నాగోల్‌ బండ్లగూడలోని రామకృష్ణ వృద్ధాశ్రమంలో పనిచేస్తున్న ఓ బాలికపై అదే హోంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అత్యాచారనికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న మరో ఇద్దరు కూడా అమెపై రేప్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో ముగ్గురు నిందితులను బుధవారం రాత్రి అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే రామకృష్ణ వృద్ధాశ్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన యువతీ, యువకులను ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా నియమించారు. ఇళ్ల వద్ద నర్సింగ్‌ పనులకు, పగటి పూట పిల్లల ఆలనాపాలన చూసేందుకు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఎండీ బయటకు పంపించడం ఆనవాయితి. 
 
ఈ పరిస్థితుల్లో ఈ యేడాది ఫిబ్రవరి నెలలో 16 ఏళ్ల బాలిక ఉద్యోగంలో చేరింది. హోంలోని డార్మెట్రీలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు గదులు ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో గణేష్‌ (24)అనే ఉద్యోగి హోంలో మహిళలు పడుకునే గదుల వద్దకు వెళ్లాడు. బయటకు వెళ్లాల్సి ఉందని చెప్పి బాలికను బలవంతంగా తీసుకెళ్లాడు. హోం ఆవరణలో ఉన్న వ్యాన్‌లో ఆమెపై అత్యాచారం చేశాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న అతని స్నేహితులు వెంకటేష్‌(24), సుబ్బయ్య(27) ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించారు. బాలిక గట్టిగా అరుస్తూ హోంలోకి వెళ్లిపోయింది. దీనిపై బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments