Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రులు అవినీతిలో మునుగుతున్నారు: మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2020 (09:53 IST)
స్థాయిని మరచి దిగజారి మాట్లాడుతున్నవాటిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి విమర్శించారు. మంత్రులు పూర్తిగా అవినీతిలో మునుగుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

మంత్రి గుమ్మనూరు జయరాం బెంజ్ కారు విషయంలో ఇప్పటికీ సరైన సమాధానం చప్పలేదన్నారు. మల్లీ 400 ఎకరాలకు పైగా దోపిడీకి పాల్పడ్డారు. వాటిని ఆధారాలతో చూపించామని తెలిపారు. అవినీతిని ప్రశ్నిస్తే బూతులు మట్లాడి దాడులు చేసి, పోలీసులతో బెదిరించి కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు.

అన్ని నియోజకవర్గాల్లో ప్రజల సొమ్మును వైసీపీ నాయకులు లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులను ఎత్తిచూపిన వాళ్ల ఇళ్లను కూల్చే పనిలో పడ్డారని పేర్కొన్నారు. ప్రజావేదిక కూల్చివేత మొదలు రాష్ట్రంలో విధ్వంసం  మొదలైందని అన్నారు. వర్షాలు పడుతున్నా రైతలుకు నీరందించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి జయరాం అవినీతిని అచ్చెన్నాయుడుకు అంటగట్టారని, ఈఎస్ఐ స్కాంలో నిందితుడు నుండి కార్లు బహుమానంగా తీసుకున్నారని వివరించారు. వైసీపీ వాళ్లు జైలుకెళ్లారని అందరినీ జైలుకు పంపాలని చూస్తున్నారని, అవినీతికి పాలనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments