Varma: చంద్రబాబు ఆగమంటే ఆగుతా.. దూకమంటే దూకుతా: పిఠాపురం వర్మ (video)

సెల్వి
శనివారం, 18 అక్టోబరు 2025 (10:23 IST)
Varma
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మపై మంత్రి నారాయణ జీరో పేరుతో చేసిన వ్యాఖ్యల వ్యవహారం కలకలం రేపింది. తన మాటలను వక్రీకరించారని, పిఠాపురంలో జనసేన, టీడీపీ మధ్య విభేదాలను జీరో చేశానని చెప్పానని మంత్రి పి నారాయణ వివరణ ఇచ్చారు. 
 
తన మాటలను వక్రీకరించారని, పిఠాపురంలో జనసేన, టీడీపీ మధ్య విభేదాలను 'జీరో' చేశానని చెప్పానని మంత్రి పి నారాయణ వివరణ ఇచ్చారు. వర్మ కూడా టీడీపీలో తాను పిల్లర్ లాంటి వాడినని.. కూటమి మధ్య విభేదాలు సృష్టించడం ఎవరి వల్లా కాదని స్పష్టం చేశారు. 
 
ఎన్డీఏ కూటమిలో పార్టీలన్నీ కలిసే ఉన్నాయన్నారు. విశాఖపట్నంలో మంత్రి నారాయణ, వర్మతో కలిసి పర్యటించారు. పిఠాపురంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి 50 వేల ఓట్లతో గెలిచిన బలమైన నాయకుడు వర్మ అన్నారు. పిఠాపురంలో జనసేన, టీడీపీ సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాయని చెప్పుకొచ్చారు మంత్రి నారాయణ.
 
పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ. చంద్రబాబు ఆగమంటే ఆగుతా.. దూకమంటే దూకుతా అంటూ ఘాటుగానే స్పందించారు. కొంతమంది పేటీఎం బ్యాచ్‌ ప్రచారాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. 
 
మంత్రి నారాయణ వ్యాఖ్యలపై కొంతమంది తప్పుడు ప్రచారం చేశారన్నారు. తాను తెలుగుదేశం పార్టీలో పిల్లర్ వంటి వాడినన్నారు. మంత్రి నారాయణ జనసేన టీడీపీ మధ్య కాకినాడ జిల్లాలో వారధిగా పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: రేబిస్‌ టీకా వేయించుకున్న రేణు దేశాయ్.. వీడియో వైరల్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments