Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nara Lokesh: తల్లికి వందనం పథకంలో రెండు వేలు నా జేబులో పడ్డాయా? నిరూపించకపోతే? (video)

సెల్వి
శనివారం, 14 జూన్ 2025 (15:10 IST)
Nara Lokesh
తల్లికి వందనం పథకంలో రూ.2వేల రూపాయలు తన జేబులో పడుతున్నాయని ఆరోపిస్తున్న వైకాపా జగన్మోహన్ రెడ్డికి మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. తన అకౌంట్‌లో ఆ డబ్బు పడినట్టు 24 గంటల్లో నిరూపించాలి. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని జగన్‌ని హెచ్చరించారు. 
 
తల్లికి వందనం పథకానికి సంబంధించి గత ప్రభుత్వం ఏ నిబంధనలైతే అమలు చేసిందో, అవే నిబంధనలను తాము కూడా పాటిస్తున్నామని, కాబట్టి ఈ పథకంపై తమను ప్రశ్నించే నైతిక హక్కు వైసీపీ వాళ్లకు లేదని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. 
 
'బాబు సూపర్ సిక్స్' హామీల్లో భాగంగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'తల్లికి వందనం' పథకం కింద 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లను జమ చేసినట్లు ఆయన వెల్లడించారు. గత విద్యాశాఖ మంత్రికి కనీస పరిజ్ఞానం కూడా లేదని, యూడైస్ డేటాలో ప్రీప్రైమరీ, ఎల్‌కేజీ, యూకేజీ పిల్లల వివరాలు కూడా కలిపి తప్పుడు లెక్కలు చూపారని లోకేష్ ఆరోపించారు. 
 
తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుందని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. ఒకటో తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు పాఠశాలలు, కళాశాలల్లో చేరిన తర్వాత కూడా వారి తల్లుల ఖాతాల్లోకి నిధులు జమచేస్తామని తెలిపారు. తల్లి లేని పిల్లలకు తండ్రి లేదా సంరక్షకుల ఖాతాల్లో, అనాథాశ్రమాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ల ద్వారా నిధులు చేరతాయని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments