Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గవర్నర్ శుభాకాంక్షలు

Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (17:56 IST)
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రుల కలలను సాకారం చేసేందుకు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన దివంగత శ్రీ పొట్టి శ్రీరాములును ఈరోజు స్మరించుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు.
 
ఆంధ్రప్రదేశ్ సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, సమృద్ధిగా సహజ వనరులను కలిగి ఉందని అవతరణ దినోత్సవం నేపధ్యంలో గవర్నర్ ప్రస్తుతించారు. మన నిర్మాణ శైలి, చిత్రలేఖనం పురాతన కాలం నుండే గుర్తింపు పొంది దినదిన ప్రవర్ధమానమవుతున్నాయని, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కూచిపూడి నృత్య శైలి భారతీయ సంప్రదాయంలో విశిష్టమైనదని గవర్నర్ వివరించారు.
 
దేశ భాషలందు తెలుగు లెస్స అన్న తీరుగానే తెలుగు భాష ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని ఆక్రమించి, అద్భుతమైన నాణ్యతకు ప్రసిద్ధి చెందిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక అభివృద్ధి, పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, అయితే సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా, అర్హులైన ఏ వ్యక్తిని వదిలిపెట్టకుండా ఉండేలా చూడాలన్నారు.
 
ప్రభుత్వ విజయానికి ప్రజల సంతోషమే కొలమానమని, పారదర్శకత, సుపరిపాలన ప్రభుత్వ ప్రధాన లక్షణంగా ఉండాలని గవర్నర్ పిలుపు నిచ్చారు. రాష్ట్రంలోని సామాన్య ప్రజల కలలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్ని ప్రయత్నాలలో మరింత విజయాన్ని సాధించాలని బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments