Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెహంది పెట్టుకున్నారు.. చిక్కుల్లో పడిన బీఈడీ విద్యార్థినిలు... ఎందుకో తెలుసా?

పండుగ అంటేనే యువతులు తమ చేతులకి మరింత అందంగా మల్చుకోవడానికి మెహింది పెట్టుకుంటారు. కానీ ఆ మెహింది కొందరి విద్యార్థినులను చిక్కుల్లో పడేసింది. అసలు విషయం ఏంటంటే... ఎడ్‌సెట్-2016 కౌన్సెలింగ్‌లో భాగంగా ఈ

Webdunia
సోమవారం, 11 జులై 2016 (09:01 IST)
పండుగ అంటేనే యువతులు తమ చేతులకి మరింత అందంగా మల్చుకోవడానికి మెహింది పెట్టుకుంటారు. కానీ ఆ మెహింది కొందరి విద్యార్థినులను చిక్కుల్లో పడేసింది. అసలు విషయం ఏంటంటే... ఎడ్‌సెట్-2016 కౌన్సెలింగ్‌లో భాగంగా ఈ నెల 9 నుంచి ప్రారంభమైన బీఈడీ సోషల్ స్టడీస్‌లో ప్రవేశానికి సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కు నగరంలోని ఏపీ కాలేజీలో కౌన్సెలింగ్ జరిగింది. 
 
కౌన్సెలింగ్‌కు హాజరైన కొందరు విద్యార్థినుల చేతికి ఉన్న మెహింది వలన బయోమెట్రిక్ యంత్రం వారి చేతి గుర్తులను స్వీకరించలేదు. దీంతో అధికారులు చేతులెత్తేశారు. కానీ విద్యార్థుల వినతి మేరకు మరొకరోజు అవకాశం కల్పించారు. ఆదివారం (10న) హాజరైన విద్యార్థుల చేతులు గోరింటాకు కారణంగా ఎర్రబడటంతో బయోమెట్రిక్ యంత్రం చేతి గుర్తులను స్వీకరించలేదు. 
 
బీఈడీ సోషల్ స్టడీస్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ సోమవారంతో (11న) ముగియనున్నందున విద్యార్థినుల ఫోటోల ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎడ్‌సెట్-2016 ప్రవేశ పరీక్ష నాటికి వారి చేతులు మాములుగా ఉండడం వలన బయోమెట్రిక్ యంత్రంతో అప్పుడు సమస్య తలెత్తలేదు. కేవలం మెహింది చేతులకు పెట్టుకోవడం వలనే సమస్య వచ్చిందని ఎడ్‌సెట్ అధికారులు పేర్కొన్నారు. కొత్తగా వచ్చిన ఈ సమస్యపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. 

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments