Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాకు ముచ్చెమటలు పోయిస్తాం : లాడెన్ కుమారుడు

ఇన్నాళ్లు మరణించాడని భావిస్తున్న బిన్ లాడెన్ కొడుకు హమ్జా బిన్ లాడెన్ వీడియోలో కనిపించడంతో అమెరికా కలవరపడుతోంది. అబ్బోటాబాద్‌ ఆపరేషన్లో తండ్రి ఒసామాతోపాటు హమ్జా బిన్‌ లాడెన్‌ కూడా మరణించారని తొలుత అమె

Webdunia
సోమవారం, 11 జులై 2016 (08:58 IST)
ఇన్నాళ్లు మరణించాడని భావిస్తున్న బిన్ లాడెన్ కొడుకు హమ్జా బిన్ లాడెన్ వీడియోలో కనిపించడంతో అమెరికా కలవరపడుతోంది. అబ్బోటాబాద్‌ ఆపరేషన్లో తండ్రి ఒసామాతోపాటు హమ్జా బిన్‌ లాడెన్‌ కూడా మరణించారని తొలుత అమెరికా భావించింది. అయితే హమ్జాకు బదులుగా ఖలీద్‌ అనే మరో కొడుకు మరణించినట్లు తెల్సింది. తాజాగా అతడు చేసిన సంచలన వాఖ్యలు అందరిని భ్రమింపజేస్తుంది. 
 
అమెరికా, దాని మిత్రదేశాలపై ప్రతీకారం తీర్చుకుంటామని బిన్ లాడెన్ కొడుకు హమ్‌జా లాడెన్ హెచ్చరించాడు. తన తండ్రి చావుకు కారణమైన ఎవ్వరిని వదిలిపెట్టే ప్రశక్తే లేదని తాజాగా విడుదలైన ఓ ఆడియో టేప్‌లో అతను స్పష్టం చేశాడు. వీ ఆర్ ఆల్ ఒసామా పేరుతో ఉన్న 21 నిమిషాల నిడివిగల ఆ ఆడియో టేప్‌ను అల్‌ఖైదా ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది. 
 
పాలస్తీనా, ఆఫ్ఘనిస్థాన్, సిరియా, ఇరాక్, యెమెన్, సోమాలియాతో పాటు ముస్లిం దేశాల ప్రజలను అణిచివేయడానికి అమెరికా ప్రయత్నిస్తోందని, దానికి తగిన ఫలితం అనుభవించాలని హమ్‌జా హెచ్చరించాడు. లాడెన్ కోసమే కాదు ఇస్లాంను రక్షించడానికి ప్రయత్నిస్తున్న అందరి తరఫున అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటానని పేర్కొన్నాడు. మరి అమెరికా ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

తర్వాతి కథనం
Show comments