Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త స్నేహితుడితో లింకు.. అతనితో భర్తను చంపేసి.. అతనిపైనే నిందలు!

Webdunia
శనివారం, 25 జనవరి 2020 (15:09 IST)
కట్టుకున్న భర్తకు స్నేహితుడుతో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ తర్వాత తన ప్రియుడుతో కలిసి భర్తను చంపించింది. ఆ నిందను ప్రియుడిపైనే మోపింది. పోలీసులకు కూడా లిఖిత పూర్వక ఫిర్యాదు కూడా చేసింది. ఈ విషయం పోలీసుల విచారణలో వెల్లడైంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడకు చెందిన ముక్కుట యాదాగౌడ్ (35), సౌజన్య దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. ఐదేళ్ల క్రితం వీరు హైదరాబాద్ నగరానికి వలస వచ్చారు. ప్రైవేటు ఉద్యోగి అయిన యాదాగౌడ్‌కు డీసీఎం డ్రైవర్ షేక్ ఆసీఫ్‌తో స్నేహం ఉంది. 
 
దీంతో తరచూ యాదాగౌడ్ ఇంటికి వచ్చే ఆసీఫ్, సౌజన్య మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం భర్తకు తెలిసి మందలించినా సౌజన్య పట్టించుకోలేదు. పైగా భర్త తనను హింసిస్తున్నాడని, అతని అడ్డు తొలగిపోతే మనం సంతోషంగా ఉండొచ్చంటూ ప్రియుడికి నూరిపోసింది.
 
దీంతో యాదాగౌడ్‌ను చంపేయాలని నిర్ణయించుకున్న ఆసిఫ్ ఈనెల 15వ తేదీన అతని వద్దకు వచ్చి పార్టీ ఉందంటూ చర్చిగా గిల్లాపూర్‌లోని డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్దకు తీసుకువెళ్లాడు. అతనితో ఫుల్‌గా మద్యం తాగించి అనంతరం కత్తితో పొడిచి చంపేశాడు. తర్వాత యాదాగౌడ్ ఇంటికి వచ్చి సౌజన్యకు విషయం చెప్పి వెళ్లిపోయాడు.
 
వెంటనే ప్లేట్ ఫిరాయించిన సౌజన్య తన భర్తను ఆసిఫ్ చంపేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ కొత్త మలుపు తిరిగింది. విచారణలో పోలీసులకు ఆసిఫ్ జరిగినదంతా చెప్పడంతో వారు ఆసిఫ్, సౌజన్య కాల్ రికార్డును పరిశీలించారు. దానిలో సౌజన్య ప్రోద్బలంతోనే ఆసిఫ్ హత్యచేశాడని నిర్ధారణ కావడంతో ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. తండ్రి హత్యకు గురికావడం, తల్లి జైలుకెళ్లడంతో పిల్లలు అనాథలుగా మారారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments