Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ మంత్రి గంటా కుమార్తె ఇంట్లో భారీ చోరీ

Webdunia
గురువారం, 21 జనవరి 2021 (09:55 IST)
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమార్తె ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గంటా కుమార్తె సాయి పూజిత కుటుంబం రుషికొండలోని బాలాజీ బేమౌంట్‌ విల్లాలో నివాసం ఉంటోంది.

ఈ నెల 10న ఆమె కుటుంబంతో కలిసి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని అత్తవారింటికి వెళ్లి, తిరిగి 11న తమ ఇంటికి కాకుండా ఎంవిసి కాలనీలోని తండ్రి గంటా ఇంటికి చేరుకుంది. ఏదో వస్తువు అవసరమవడంతో ఇంట్లో ఒకరిని విల్లాకు పంపించగా చోరీ విషయం బయటపడింది.

రూ.10 లక్షలు విలువ చేసే బంగారం, డైమండ్‌ చెవిదిద్దులు, ఇతర వెండి వస్తువులు చోరీకి గురైనట్లు తేలింది. దీనిపై పాలెం పోలీసులకు ఫిర్యాదు అందగా.. సాయి పూజిత ఇంట్లో పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments